Mon Dec 23 2024 12:57:22 GMT+0000 (Coordinated Universal Time)
అఖండ 2 వర్క్ జరుగుతుంది.. బోయపాటి శ్రీను
బాలకృష్ణ అఖండ 2 అప్డేట్ ఇచ్చిన బోయపాటి శ్రీను. 'స్కంద' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బోయపాటి మాట్లాడుతూ..
నందమూరి నటసింహ బాలకృష్ణ (Balakrishna), మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను (Boyapati Sreenu) కంబినేషనల్ వచ్చిన మూడో సినిమా 'అఖండ' (Akhanda). గత రెండు సినిమాలు మాదిరి ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్ కాకుండా, బాలయ్యని 'అఘోర'గా ఒక సరికొత్త పాత్రలో చూపించి బోయపాటి ఆడియన్స్ ని థ్రిల్ ఫీల్ చేశాడు. ఈ మూవీతో బాలయ్య 100 కోట్ల క్లబ్ లోకి కూడా అడుగుపెట్టాడు.
సినిమాపై బాలీవుడ్ లో కూడా ఆసక్తి చూపించడంతో.. డబ్ చేసి అక్కడ కూడా రిలీజ్ చేశారు. ఇక ఈ చిత్రానికి ఆడియన్స్ నుంచి ఎంతో ఆదరణ వస్తుండడంతో సీక్వెల్ ని కూడా తీసుకు రావాలని దర్శకనిర్మాతలు భావించారు. దీనిపై కొన్నాళ్లుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ సీక్వెల్ గురించి బోయపాటి మాట్లాడాడు. రామ్ పోతినేని (Ram Pothineni) హీరోగా బోయపాటి డైరెక్ట్ చేసిన 'స్కంద' ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి బాలకృష్ణ చీఫ్ గెస్ట్ గా వచ్చాడు. దీంతో బాలయ్య అభిమానులు కూడా ఈవెంట్ కి భారీగా తరలి వచ్చారు. ఇక ఈ కార్యక్రమంలో బోయపాటి మాట్లాడుతుండగా అఖండ 2 గురించి అభిమానులు ప్రశ్నించారు. బోయపాటి బదులిస్తూ.. "కొంచెం లేట్ అయినా అఖండ 2 మాత్రం కచ్చితంగా ఉంటుంది. ఆ మూవీకి సంబంధించిన వర్క్ జరుగుతూనే ఉంది" అంటూ చెప్పుకొచ్చాడు. ఇక మాటలతో బాలయ్య అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.
బోయపాటి తదుపరి సినిమా అల్లు అర్జున్ తో ఉండబోతుందని తెలుస్తుంది. మరి ఆ మూవీ అయిన తరువాత అఖండ 2 మొదలుపెడతాడా..? లేదా ముందే పట్టాలు ఎక్కిస్తాడా..? చూడాలి. ప్రస్తుతం బాలయ్య 'భగవంత్ కేసరి' (Bhagavanth Kesari) సినిమాలో నటిస్తున్నాడు. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా చిత్రీకరణ చివరి దశలో ఉంది. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంటే యంగ్ యాక్ట్రెస్ శ్రీలీల ఒక ముఖ్య పాత్ర చేస్తుంది. దసరా కానుకగా అక్టోబర్ 19న ఆడియన్స్ ముందుకు రాబోతుంది.
Next Story