వారికి గుణపాఠం నేర్పిన బోయపాటి
ఈ సంక్రాంతికి నాలుగు సినిమాలు రిలీజ్ అయితే అందులో రెండు సినిమాలు హిట్ టాక్ ని సొంతం చేసుకుంటే మరొకటి సూపర్ హిట్ ని, ఇంకో సినిమా [more]
ఈ సంక్రాంతికి నాలుగు సినిమాలు రిలీజ్ అయితే అందులో రెండు సినిమాలు హిట్ టాక్ ని సొంతం చేసుకుంటే మరొకటి సూపర్ హిట్ ని, ఇంకో సినిమా [more]
ఈ సంక్రాంతికి నాలుగు సినిమాలు రిలీజ్ అయితే అందులో రెండు సినిమాలు హిట్ టాక్ ని సొంతం చేసుకుంటే మరొకటి సూపర్ హిట్ ని, ఇంకో సినిమా డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది. డిజ్జాస్టర్ టాక్ సొంతం చేసుకున్న సినిమా రామ్ చరణ్ ‘వినయ విధేయ రామ’. బోయపాటి డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాకు నెగటివ్ టాక్ వచ్చినప్పటికీ వసూళ్లు బాగానే వస్తున్నాయి. కానీ సినిమా చూసినా ప్రతి వాళ్లు సినిమాలో కొన్ని సీన్స్ గురించి ట్రోల్ చేయకుండా ఉండట్లేదు. ముఖ్యంగా యాక్షన్ సీన్లు చూసి నవ్వుకోవడం, ఎమోషన్ సీన్లు కామెడీగా మారడం కూడా వినయ విధేయ రామతోనే జరిగింది. దీనికి పూర్తి బాధ్యత బోయపాటిదే.
బోయపాటికి ఫోన్ కూడా చేయలేదా..?
తన మీద ఉన్న ఓవర్ కాంఫిడెన్స్ తో ఈ సినిమాను తీశాడు బోయపాటి. కనీసం చిరంజీవి ఫైనల్ అవుట్ పుట్ కూడా చూడకుండా బోయపాటి మీద నమ్మకంతో ఈ సినిమాను రిలీజ్ చేసేశారు. కానీ బోయపాటి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. సినిమా రిలీజ్ అయిన తరువాత కనీసం చిరు నుంచి గానీ, చరణ్ నుంచి గానీ బోయపాటికి ఒక్క ఫోన్ కాల్ కూడా వెళ్లలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవొచ్చు. సినిమా రిలీజ్ తరువాత చిరు ప్రెస్ మీట్ లేదా సక్సెస్ మీట్ గానీ పెట్టి సినిమా బాగుందని.. ఆ సీన్స్ బాగున్నాయని.. వాళ్లు అలా చేసారని.. వీళ్లు ఇలా చేసారని.. చెప్పేవారు. కానీ చెప్పలేదు అంటే చిరుకి ఈ సినిమా ఏ మాత్రం నచ్చిందో అర్థం చేసుకోవచ్చు. ఏదేమైనా బోయపాటి.. చిరు, చరణ్ లకు మంచి గుణపాఠమే నేర్పాడు.