Mon Dec 23 2024 08:41:16 GMT+0000 (Coordinated Universal Time)
Prabhas : ప్రభాస్, బోయపాటి సినిమా.. గోపీచంద్ విలన్గా..
ప్రభాస్, గోపిచంద్ ఫ్యాన్స్ తో పాటు టాలీవుడ్ ఆడియన్స్ కూడా ఎదురు చూస్తున్న కాంబినేషన్ ని బోయపాటి సెట్ చేస్తున్నారట.
Prabhas : రెబల్ స్టార్ ప్రభాస్, మ్యాచో స్టార్ గోపిచంద్ కలిసి 'వర్షం' సినిమాలో నటించిన సంగతి అందరికి తెలిసిందే. హీరో అండ్ విలన్ గా నటించిన ఈ ఇద్దరు మిత్రులు ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్నారు. ఈ కాంబినేషన్ ని మరోసారి చూడాలని ప్రభాస్, గోపీచంద్ ఫ్యాన్స్ తో పాటు టాలీవుడ్ ఆడియన్స్ కు కోరుకుంటున్నారు. కానీ ఆ ఆశలు మాత్రం నిజం అవ్వడం లేదు. అయితే ఇప్పుడు ఫ్యాన్స్ కోరిక నిజమయ్యేలా కనిపిస్తుంది.
టాలీవుడ్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ప్రభాస్ ఓ సినిమా చేయబోతున్నారంటూ కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఉన్న సినిమాలు అన్ని పూర్తి అవ్వగానే బోయపాటి మూవీ పట్టాలు ఎక్కనుందట. ఇక ఈ మూవీలోనే గోపిచంద్ కూడా నటించబోతున్నారట. ప్రభాస్ కి విలన్ గా గోపీచంద్ ని బోయపాటి ఎంపిక చేసుకున్నట్లు ఫిలిం వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.
మరి ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియదు గాని, ఈ ఇద్దరి హీరోల అభిమానులు మాత్రం.. ఈ వార్తలు నిజమైతే బాగుండు అని ఫీల్ అవుతున్నారు. మరి బోయపాటి నిజంగానే ఈ కాంబినేషన్ ని సెట్ చేస్తాడో లేదు చూడాలి. కాగా ప్రస్తుతం ప్రభాస్ చేతిలో కల్కి, రాజాసాబ్ సలార్ 2, స్పిరిట్ సినిమాలు ఉన్నాయి. వీటిలో కల్కి, రాజాసాబ్ షూటింగ్ సెట్స్ పై ఉన్నాయి. సలార్ 2 షూటింగ్ మే నుంచి మొదలుకానుంది సమాచారం.
ఇక సందీప్ వంగ దర్శకత్వంలో నటించబోయే 'స్పిరిట్' మూవీ ఈ ఏడాది చివరిలో సెట్స్ పైకి వెళ్లనుందట. ఈ ప్రాజెక్ట్స్ అన్ని పూర్తి చేసుకొని ప్రభాస్, బోయపాటి సినిమా మొదలుపెట్టాలంటే.. వచ్చే ఏడాది సెకండ్ హాఫ్ లోనే అవుతుంది. మరి ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుంది, ఎప్పుడు ఆడియన్స్ ముందుకు వస్తుందో చూడాలి.
Next Story