Mon Dec 23 2024 02:15:52 GMT+0000 (Coordinated Universal Time)
#BoyapatiRapo First Thunder : ఇంకేంటి దాటేది నా బొంగులో లిమిట్స్
ఈ గ్లింప్స్ లో రామ్ పోతినేని పక్కా మాస్ హీరోగా కనిపించాడు. గ్లింప్స్ మొత్తం యాక్షన్ సీక్వెన్స్ తో, బోయపాటి మార్క్..
టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో, చాక్లెట్ బాయ్ రామ్ పోతినేనిని ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మాస్ హీరోగా మార్చేశాడు పూరీ జగన్నాథ్. లవ్ స్టోరీలే కాకుండా యాక్షన్ సినిమాలవైపు మొగ్గుచూపుతున్నాడు రామ్. తాజాగా రామ్ బోయపాటి కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. ఇంకా టైటిల్ ఫిక్స్ చేసుకోని #BoyapatiRapo నుంచి మేకర్స్ రామ్ బర్త్ డే సందర్భంగా First Thunderను వదిలారు.
ఈ గ్లింప్స్ లో రామ్ పోతినేని పక్కా మాస్ హీరోగా కనిపించాడు. గ్లింప్స్ మొత్తం యాక్షన్ సీక్వెన్స్ తో, బోయపాటి మార్క్ డైలాగ్స్ తో నిండిపోయాయి. తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మరో లెవల్. “నీ స్టేట్ దాటలేనన్నావ్ దాటా. నీ గేట్ దాటలేనన్నావ్ దాటా. నీ పవర్ దాటలేనన్నావ్ దాటా. ఇంకేంటి దాటేది నా బొంగులో లిమిట్స్” అంటూ రామ్ చెప్పిన డైలాగ్ హైలెట్ గా నిలిచాయి. థియేటర్లలో ఇలాంటి డైలాగ్స్ కు విజిల్స్ ఖాయం అలాగే దున్నపోతుపై రామ్ ఎంట్రీ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంది.
శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై చిట్టూరి శ్రీనివాసా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. రామ్ కి జోడీగా శ్రీలీల నటిస్తోంది. ఈ సినిమాను బోయపాటి శ్రీను అక్టోబర్ 20న పాన్ ఇండియా వైడ్ విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. రెడ్, ది వారియర్ సినిమాలకు ఊహించిన మేర అభిమానులను ఆకట్టుకోలేకపోయాయి. ఈ సినిమా రామ్ పోతినేనికి కంబ్యాక్ అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.
Next Story