Mon Dec 23 2024 06:06:44 GMT+0000 (Coordinated Universal Time)
వివాదంలో లైగర్ ? బాయ్ కాట్ లైగర్ అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్
చాలా రోజులుగా హిందీలో నెపొటిజం గురించి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో లైగర్ నిర్మాణ భాగస్వామిగా ఉన్న కరణ్..
రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో పాన్ ఇండియా వైడ్ గా విడుదలకు రెడీ అవుతున్న సినిమా లైగర్. ఈ సినిమాతో విజయ్ దేవరకొండ పాన్ ఇండియా స్టార్ కానున్నారు. డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'లైగర్' పై ఫ్యాన్స్ ఫుల్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. కాగా.. ఇటీవలే ఈ సినిమాకు సెన్సార్ బోర్డు నుంచి ఊహించని షాక్ తగిలిన విషయం తెలిసిందే. తాజాగా.. లైగర్ ఓ వివాదంలో చిక్కుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ లో ఊపందుకున్న బాయ్ కాట్ లైగర్ పై కూడా ప్రభావం చూపుతుందన్న ఊహాగానాలు మొదలయ్యాయి.
చాలా రోజులుగా హిందీలో నెపొటిజం గురించి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో లైగర్ నిర్మాణ భాగస్వామిగా ఉన్న కరణ్ జోహార్ పై నెపొటిజం కామెంట్స్ కామన్గా ఉన్నాయి. లైగర్ పై బాయ్ కాట్ ప్రభావం ఉంటుందనేందుకు అనన్య పాండే కూడా ఓ కారణం అయ్యే అవకాశం ఉందట. ఇదే విషయాన్ని కొందరు సోషల్ మీడియాలో హైలెట్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. అంతేకాదు లైగర్ సినిమాలో.. 'ఆ… ఫట్', 'అకిడి పకిడి..' పాటల్లోని కొన్ని హిందీ లిరిక్స్ను తప్పు పడుతూ.. విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ట్విట్టర్ లో #BoycottLigerMovie అనే హ్యాష్ ట్యాగ్ తో నెటిజన్లు ట్వీట్లు పెడుతున్నారు. ఈ వివాదాన్ని దాటుకుని లైగర్ రిలీజ్ అవుతుందో లేదో చూడాలి.
Next Story