Sat Dec 21 2024 06:08:05 GMT+0000 (Coordinated Universal Time)
బ్రహ్మాస్త్రం 4 డేస్ కలెక్షన్స్.. తొలిరోజే రికార్డు స్థాయిలో వసూళ్లు
శని, ఆదివారాల్లోనే కాకుండా.. సోమవారం కూడా బ్రహ్మాస్త్రం మంచి వసూళ్లు రాబట్టడం విశేషం. సోమవారం హిందీలో..
బాలీవుడ్ రియల్ కపుల్ రణబీర్ కపూర్ - అలియా భట్ జంటగా.. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమాగా విడుదలైన చిత్రం బ్రహ్మాస్త్రం. సెప్టెంబర్ 9న విడుదలైన ఈ సినిమా.. ఫస్ట్ డే నే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్, తర్వాత ఏం జరుగుతుందోనన్న సస్పెన్స్.. హిట్ టాక్ కి కారణమయ్యాయి. విడుదలైన మూడ్రోజుల్లోనే బ్రహ్మాస్త్రం రూ.100 కోట్ల క్లబ్ లో చేరింది. బ్రహ్మాస్త్రం రాకతో.. బాలీవుడ్ చిత్రపరిశ్రమ మళ్లీ గాడిలో పడింది.
శని, ఆదివారాల్లోనే కాకుండా.. సోమవారం కూడా బ్రహ్మాస్త్రం మంచి వసూళ్లు రాబట్టడం విశేషం. సోమవారం హిందీలో రూ.14.25 కోట్లు, మిగతా భాషలన్నింటిలో రూ.17-19 కోట్లు వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. దీనిని బట్టి చూస్తే.. తొలి నాలుగు రోజుల్లోనే బ్రహ్మాస్త్రం రూ.137-రూ.139 కోట్లు వసూళ్లు చేసి.. బాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. బ్రహ్మాస్త్రం వసూళ్లలో ఇదే హవా కొనసాగితే.. కొద్దిరోజుల్లోనే రూ.250 కోట్ల మార్కు అందుకునే అవకాశం ఉంది.
తొలిభాగం శివ, పార్ట్ 2 దేవ్.. మొత్తం కలిపి కరణ్ జొహార్ రూ.400 కోట్ల పై చిలుకు బడ్జెట్ తో ఈ సినిమాలను నిర్మించాడు. బ్రహ్మాస్త్రం పార్ట్ 1 శివలో నాగార్జున, అమితాబ్ బచ్చన్, మౌని రాయ్ లు నటించగా.. సినిమా ఆరంభంలో షారుఖ్ ఖాన్ అతిథిపాత్రలో కనిపించారు.
Next Story