Thu Apr 10 2025 15:22:48 GMT+0000 (Coordinated Universal Time)
Brahma Yugam:ఓటీటీ లోకి వచ్చేస్తున్న మమ్ముట్టి 'భ్రమ యుగం'
మళయాళ మెగాస్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించిన సినిమా

Brahma Yugam:మళయాళ మెగాస్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించిన సినిమా భ్రమయుగం. ఈ సినిమా మలయాళంలో మంచి హిట్ ను అందుకుంది. అయితే తెలుగులో పెద్దగా చూడలేదు. చాలా థియేటర్లలో రెండు రోజులకే సినిమాను తీసేయాల్సి వచ్చింది. తెలుగు ప్రేక్షకుల ఆదరణ లేకపోవడంతో ఈ సినిమా మన దగ్గర ఫ్లాప్ ను మూటగట్టుకుంది. అయితే ఈ సినిమాను ఓటీటీలో త్వరలోనే చూడబోతున్నారు.
సోనీ LIVలో OTT అరంగేట్రం చేయబోతోంది. రాహుల్ సదాశివన్ దర్శకత్వం వహించిన ఈ హారర్ థ్రిల్లర్ ఓటీటీ ద్వారా మరింత మందికి దగ్గరకాబోతోంది. OTT ప్లాట్ఫారమ్ తాజా అప్డేట్ ప్రకారం.. మార్చి 15, 2024న సినిమా స్ట్రీమింగ్ కు అందుబాటులో ఉంటుంది. ఈ చిత్రం మలయాళంతో పాటు తెలుగు, తమిళంలో అందుబాటులో ఉంటుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. బ్రహ్మయుగంలో అర్జున్ అశోకన్, సిద్ధార్థ్ భరతన్, అమల్దా లిజ్లతో తారాగణం ఉంది. నైట్ షిఫ్ట్ స్టూడియోస్ ఎల్ఎల్పి, వై నాట్ స్టూడియోస్పై చక్రవర్తి రామచంద్ర, శశికాంత్ నిర్మించారు. క్రిస్టో జేవియర్ సంగీతం బాగుంది. ఈ సినిమా కేవలం మూడంటే మూడు క్యారెక్టర్ల చుట్టూ తిరుగుతుంది. సైకలాజికల్ గా థ్రిల్లింగ్ గా అనిపించే ఈ సినిమా.. ప్రేక్షకుల మెదడుకు పని పెడుతుంది. ఫిబ్రవరి 15న మలయాళంలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్గా నిలిచింది. ప్రేమలు, ముజమ్మాళ్ బాయ్స్ సినిమాతో పోటిగా విడుదలైన ఈ చిత్రం ఇప్పటివరకు 60 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.
Next Story