13 మందిని డేటింగ్ చేశాక పెళ్లి చేసుకున్న సింగర్
లాస్ వెగాస్, నెవాడాలోని ఎ లిటిల్ వైట్ వెడ్డింగ్ చాపెల్‌లో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు.
అమెరికన్ గాయని, పాటల రచయిత మరియు నటి బ్రిట్నీ స్పియర్స్ తన చిరకాల ప్రియుడు సామ్ అస్గారిని జూన్ 9, 2022న వివాహం చేసుకుంది. ఈ జంట గత ఐదేళ్లుగా డేటింగ్లో ఉన్నారు. చివరకు పెళ్లి చేసుకున్నారు. లాస్ ఏంజెల్స్‌లో సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య వీరి పెళ్లి జరిగింది. 40 ఏళ్ల పాప్ స్టార్ బ్రిట్నీ స్పియర్స్ ఇటీవలే సంరక్షణ కేసు నుంచి బయటపడింది. 13 ఏళ్ల పాటు ఆమె తండ్రి సంరక్షణలోనే ఉన్నారు. సంరక్షణలో ఉండడం వల్ల పెళ్లి చేసుకోలేకపోతున్నానని, పిల్లల్ని కనలేకపోతున్నట్లు బ్రిట్నీ చెప్పుకునేది. పర్సనల్ ట్రైనర్ అస్ఘరితో 2016లో స్పియర్స్‌కు పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత అస్గారితో కలిసి బిడ్డను కనాలని కూడా ప్లాన్ చేసుకుంది. ఇటీవల తాను తల్లి కాబోతున్నట్లు బ్రిట్నీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతలోనే బిడ్డను కొల్పోయానంటూ సోషల్ మీడియా వేదికగా ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆమె తన ఇన్స్టాగ్రామ్ భావోద్యేగ పోస్ట్‌ను షేర్ చేసింది. మేం మా బిడ్డను కోల్పోయాం. మా జీవితంలో విషాదంలో నెలకొందని తెలిపింది. ఇక ఇప్పుడు పెళ్లి చేసుకుంది బ్రిట్నీ.