Fri Nov 22 2024 20:50:31 GMT+0000 (Coordinated Universal Time)
అంబటికి బ్రో నిర్మాత కౌంటర్.. ఇప్పట్లో ఆగేలా లేదు
జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'బ్రో' సినిమా పెద్ద రాజకీయ దుమారాన్ని
జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'బ్రో' సినిమా పెద్ద రాజకీయ దుమారాన్ని రేకెత్తించింది. ఈ చిత్రంలో శ్యాంబాబు పాత్ర ఆంధ్రప్రదేశ్ మంత్రి అంబటి రాంబాబును ట్రోల్ చేయడానికి సృష్టించారని కామెంట్లు వినిపించాయి. ఈ చిత్రంలో శ్యాంబాబు పాత్రను తిట్టడం ద్వారా, పవన్ గతంలో అంబటి చేసిన నృత్యాలను పరోక్షంగా విమర్శించారు.
'బ్రో' విడుదల రోజున చిత్ర నిర్మాతలు ఈ పాత్రకు శ్యాంబాబు అని కాకుండా నేరుగా రాంబాబు అని పిలిచి ఉండవచ్చని అంబటి రాంబాబు అన్నారు. అక్కడితో ఆగని ఆయన పవన్ బ్రో సినిమా వెనక పెద్ద స్కామ్ ఉందని అన్నారు. 'ప్రొడ్యూసర్ కి కలెక్లన్లు నిల్లు... ప్యాకేజీ స్టార్ కి పాకెట్ ఫుల్లు' అంటూ విమర్శలు గుప్పించారు. తాము కూడా పవన్ కళ్యాణ్ వ్యక్తిగత తీరుపై కథను సిద్ధం చేస్తున్నామన్నారు. ఈ సినిమాకు అనేక పేర్లు పరిశీలనలో ఉన్నాయన్నారు. నిత్య పెళ్లికొడుకు, పెళ్లిళ్లు - పెటాకులు, తాళి - ఎగతాళి, బహుభార్యా ప్రవీణుడు, మూడు ముళ్లు - ఆరు పెళ్లిళ్లు, మ్రో (మ్యారెజెస్ రిలేషన్స్ అఫెండర్), అయిన పెళ్లిళ్లెన్నో.. పోయిన చెప్పులెన్నో.. అనే టైటిల్స్‌ను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. పవన్ నటించిన కొత్త సినిమా నిర్మాత టీడీపీకి చెందిన ఎన్నారై విశ్వప్రసాద్ అన్నారు. పవన్ కు ఇవ్వాల్సిన ప్యాకేజీని విశ్వప్రసాద్ ద్వారా అందించారని.. బ్లాక్ మనీని వైట్ మనీగా చేసి పవన్ కు ఇచ్చారన్నారు. అమెరికా నుండి పవన్ కు వస్తున్న డబ్బు పెద్ద స్కామ్ అని ఆరోపించారు.
అయితే మంత్రి అంబటి చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు బ్రో మూవీ నిర్మాత టీజీ. విశ్వప్రసాద్. ట్యాక్సులకు సంబంధించి డాక్యుమెంట్లు పక్కాగా ఉన్నాయన్నారు. ఇవన్నీ ఊహాజనితమేనని.. రాజకీయ ఆరోపణలను సీరియస్‌గా తీసుకోవాల్సిన పనిలేదన్నారు. బ్రో సినిమా బ్లాక్ బస్టర్ అయ్యిందన్నారు. ఎవరు ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారో చెప్పాల్సిన అవసరం లేదని విశ్వ ప్రసాద్ తెలిపారు. ఇందుకు సంబంధించి ఏమైనా ఉంటే మాత్రం ఏజెన్సీలకు సమాధానమిస్తామన్నారు.
Next Story