Sat Dec 21 2024 02:32:08 GMT+0000 (Coordinated Universal Time)
RC16 స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ స్టోరీ..? డైరెక్టర్ బుచ్చిబాబు ఏమన్నాడు..?
రామ్ చరణ్ RC16 స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ లో ఉండబోతుందా..? దర్శకుడు బుచ్చిబాబు ఏం చెప్పాడు..?
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), 'ఉప్పెన' డైరెక్టర్ బుచ్చిబాబు (Buchi Babu Sana) కాంబినేషన్ లో 'RC16' తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. రంగస్థలం సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసి ఆ మూవీ సక్సెస్ లో తాను ఒక భాగమైన బుచ్చిబాబు.. ఇప్పుడు రామ్ చరణ్ తో అదే తరహాలో రా అండ్ రస్టిక్ గా ఒక సినిమా తెరకెక్కించబోతున్నాడు అని తెలియడంతో మూవీ పై అంచనాలు ఓ రేంజ్ లో క్రియేట్ అయ్యాయి.
ఇక తాజాగా బుచ్చిబాబు డైరెక్ట్ చేసిన 'ఉప్పెన' సినిమాకు నేషనల్ అవార్డు రావడంతో ఆ అంచనాలు మరింత రెట్టింపు అయ్యాయి. ఇతర భాషల్లో కూడా ఈ మూవీ పై మంచి బజ్ క్రియేట్ అవుతుంది. ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ (A R Rahman) సంగీతం అందిస్తుండడం మరో ఆకర్షణ. ఇదంతా ఇలా ఉంటే, ఈ మూవీ స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ లో ఉండబోతుందని, రామ్ చరణ్ కబడ్డీ ప్లేయర్ గా కనిపించబోతున్నాడని ఎప్పటినుంచో వినిపిస్తున్న వార్త.
తాజాగా ఈ విషయం గురించి బుచ్చిబాబుని ఒక ఇంటర్వ్యూలో ప్రశ్నించగా, తను బదులిస్తూ.. "ఫుల్ రా అండ్ రస్టిక్ గా ఉంటుంది. మీరు ఊహించిన దానికంటే ఎక్కువుగా ఉంటుంది. స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ అంటే నేను చెప్పలేను. నేను ఎప్పుడు ఒక జోనర్ ఆడియన్స్ ని టార్గెట్ చేసుకొని కథ రాసుకోను. నా సినిమాని అన్ని సెక్షన్ అఫ్ ఆడియన్స్ చూసేలా చిత్రీకరిస్తుంటా" అంటూ బదులిచ్చాడు. స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ అవును అని చెప్పలేదు, కాదు అని కూడా చెప్పలేదు.
గతంలో రామ్ చరణ్ నేషనల్ సమ్మిట్ లో మాట్లాడుతూ.. ఒక పల్లెటూరి మట్టి కథతో కంప్లీట్ ఎమోషన్స్ తో RC16 ఉంటుందని చెప్పుకొచ్చాడు. చరణ్ అండ్ బుచ్చిబాబు మాటలు కలిపి చూస్తే.. ఈ సినిమా పూర్తిగా స్పోర్ట్స్ నేపథ్యంతోనే కాకుండా ఫ్యామిలీ అండ్ పల్లెటూరు మట్టి కథలతో ఉండనుందని తెలుస్తుంది. ఈ మూవీ షూటింగ్ ఈ డిసెంబర్ లో లేదా వచ్చే ఏడాది జనవరిలో సెట్స్ పైకి వెళ్తుందని బుచ్చిబాబు పేర్కొన్నాడు.
Next Story