తమన్నా బంపర్ ఆఫర్ కొట్టేసిందిగా?
మిల్క్ బ్యూటీ తమన్నా చేతిలో ప్రస్తుతం పెద్దగా సినిమాలు లేకపోవడంతో ఓ మంచి ఆఫర్ కోసం ఎదురుచూస్తుంది. ఒక పెద్ద సినిమా పడితే తన కెరీర్ మళ్లీ [more]
మిల్క్ బ్యూటీ తమన్నా చేతిలో ప్రస్తుతం పెద్దగా సినిమాలు లేకపోవడంతో ఓ మంచి ఆఫర్ కోసం ఎదురుచూస్తుంది. ఒక పెద్ద సినిమా పడితే తన కెరీర్ మళ్లీ [more]
మిల్క్ బ్యూటీ తమన్నా చేతిలో ప్రస్తుతం పెద్దగా సినిమాలు లేకపోవడంతో ఓ మంచి ఆఫర్ కోసం ఎదురుచూస్తుంది. ఒక పెద్ద సినిమా పడితే తన కెరీర్ మళ్లీ ఊపందుకుంటుందనే ఆశతో ఉన్న ఆమెకు ఓ బంపర్ ఆఫర్ తగిలింది. ఏకంగా ఆమె ‘కేజీఎఫ్’ హీరో యశ్ సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసిందని చెబుతున్నారు.
ప్రస్తుతం హీరో యశ్ ‘కేజీఎఫ్ 2’ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈమూవీ అక్టోబర్ లో రిలీజ్ కానుంది. దీని తరువాత కన్నడంలో ఆయన నార్తన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ఆల్రెడీ ఈసినిమాకు సంబంధించి చర్చలు కూడా పూర్తయ్యాయని అంటున్నారు.
ఇక హీరోయిన్ గా తమన్నా అయితే బాగుంటుందనే ఉద్దేశంతో ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా ప్రచారం జరిగింది. ఆమె ఓకే కూడా చెప్పినట్టు సమాచారం. ఒకవేళ ఇది నిజం అయితే తమన్నా కెరీర్ ఊపందుకున్నట్టే.
- Tags
- tamanna