వదులుకుని మంచి పనిచేసాడు బన్నీ
అల్లు అర్జున్ తెలుగు తమిళ్ లో బై లింగ్యువల్ గా ఒక సినిమాని స్టూడియో గ్రీన్ బ్యానర్ లో జ్ఞానవేల్ రాజా నిర్మాతగా లింగుస్వామి దర్శకత్వంలో గ్రాండ్ గా లాంచ్ చేసాడు. సినిమా మొదలై చాలా రోజులు గడిచినా ఆ సినిమా మాత్రం పట్టాలెక్కలేదు. జ్ఞానవేల్ రాజా తో వచ్చిన లింగుస్వామి కథకు బన్నీ కనెక్ట్ కాకపోవడంతో ఆ సినిమా ఆగిపోయిందనే టాక్ ఉంది. ఇక జ్ఞానవేల్ రాజా ఆనంద్ శంకర్ తో నోటా కథ బన్నీకి చెప్పించగా.. బన్నీ ఈ కథ నాకు సెట్ కాదు... నేను సీఎం పాత్రలో బాగోనని ఆ డైరెక్టర్ అండ్ నిర్మాతకు చెప్పేసి ఆ సినిమా చెయ్యలేదు.
అయితే నోటా సినిమా విడుదలకు ముందు నోటా సినిమాని విజయ్ కాదు బన్నీ చెయ్యాల్సింది అంటూ కథనాలు ప్రసారం అయ్యాయి. ఇక అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన నోటా కథతో విజయ్ దేవరకొండ దగ్గరికి జ్ఞానవేల్ రాజా అండ్ ఆనంద్ శంకర్ వెళ్లగా.. నోటా కథకి విజయ్ కనెక్ట్ అవడమూ.. ఎలాగూ పెద్ద బ్యానర్ లో కొత్త కథతో తమిళంలో పాగా వెయ్యొచ్చనుకుని నోటా కథకి విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు. అయితే విజయ్ కూడా గీత గోవిందం సినిమా హిట్ అయ్యాక అయితే ఈకథ ఒప్పుకునే వాడు కాకపోవచ్చు. మరి గీత గోవిందం సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడే నోటా అనే పొలిటికల్ డ్రామా ని ఒప్పుకోవడం ఆ సినిమా చెయ్యడం జరిగాయి.
ఇక నోటా నిన్న శుక్రవారం విడుదలై నెగెటివ్ టాక్ తో నడుస్తుంది. ఈ సినిమాతో స్టార్ హీరో రేంజ్ క్రేజ్ తెచ్చుకున్న విజయ్ కి దెబ్బ బాగా తగిలింది. నోటా కథని కరెక్ట్ గా అంచనా వేయకపోవడం, ప్రేక్షకులకు తన దగ్గరనుండి ఎలాంటి కొత్తదనం కోరుకుంటున్నారో అనేది విజయ్ పక్కన పెట్టడంతోనే నోటా కథని ఒప్పుకుని సినిమా చేసి చేతులు కాల్చుకున్నాడు. అయితే ఈ సినిమా కథని రిజెక్ట్ చేసి అల్లు అర్జున్ బతికిపోగా.. విజయ్ ఇరుకున పడ్డాడు. అసలే నా పేరు సూర్య ప్లాప్ తో ఉన్న బన్నీ ఇప్పుడు వరసగా నోటా ప్లాప్ ని ఖాతాలో వేసుకోవాల్సి వచ్చేది. ఇక బన్నీ ప్లాప్ కాస్తా ఇప్పుడు విజయ్ దేవరకొండని తగులుకుందన్నమాట.