Thu Dec 19 2024 16:32:13 GMT+0000 (Coordinated Universal Time)
పుష్ప 2 ఆర్టిస్టుల బస్సుకు యాక్సిడెంట్
తాజాగా మూడో షెడ్యూల్ కూడా కంప్లీట్ చేసినట్లు తెలుస్తోంది. షూటింగ్ పూర్తి చేసుకుని పుష్ప 2 ఆర్టిస్టులతో తిరిగి వస్తోన్న..
అల్లుఅర్జున్ హీరోగా.. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పుష్ప-2 షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికి రెండు షెడ్యూల్స్ షూటింగ్ లు పూర్తవ్వగా.. తాజాగా మూడో షెడ్యూల్ కూడా కంప్లీట్ చేసినట్లు తెలుస్తోంది. షూటింగ్ పూర్తి చేసుకుని పుష్ప 2 ఆర్టిస్టులతో తిరిగి వస్తోన్న బస్సు రోడ్డు ప్రమాదానికి గురైంది. బుధవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. సినిమాలో నటించిన పలువురు ఆర్టిస్టులు షూటింగ్ ముగించుకుని ఓ ప్రైవేట్ బస్సులో తిరిగి హైదరాబాద్ కు వస్తున్నారు.
హైదరాబాద్-విజయవాడ హైవేపై నార్కట్ పల్లి శివార్లలో ఆగి ఉన్న ఓ ఆర్టీసీ బస్సును వెనుక నుండి ప్రైవేట్ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న ఆర్టిస్టుల్లో ఇద్దరికి తీవ్ర గాయాలు, పలువురికి స్వల్పగాయాలు అయినట్లు తెలుస్తోంది. గాయపడిన ఆర్టిస్టులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం కారణంగా హైవేపై కొద్దిసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. ఈ ప్రమాదంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
Next Story