Sun Dec 22 2024 08:34:58 GMT+0000 (Coordinated Universal Time)
Mahesh Babu : 'బిజినెస్మెన్' సినిమా ఆ హీరో చేయాల్సింది.. కానీ మహేష్..
'బిజినెస్మెన్' సినిమా అసలు మహేష్ బాబు, పూరిజగన్నాథ్ది కాదంట. ఈ కథని మరో స్టార్ డైరెక్టర్, మరో స్టార్ హీరోతో చేయాలని..
Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు, మాస్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ కాంబినేషన్ లో ఆడియన్స్ ముందుకు వచ్చి ఇండస్ట్రీని షేక్ చేసిన సినిమా 'పోకిరి'. దాని తరువాత మళ్ళీ ఆ కాంబినేషన్ లో వచ్చిన మోస్ట్ హైపెడ్ మూవీ 'బిజినెస్మెన్'. ముంబై డాన్ బ్యాక్డ్రాప్ తో వచ్చిన ఈ సినిమాలో మహేష్ బాబు.. సూర్య భాయ్ పాత్రలో ఇంటెన్స్ యాక్టింగ్ తో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేశారు. అయితే ఈ సినిమా అసలు మహేష్ బాబు, పూరిజగన్నాథ్ది కాదంట. ఈ కథని మరో స్టార్ డైరెక్టర్, మరో స్టార్ హీరోతో చేయాలని రాసుకున్నారు. ఇంతకీ ఆ హీరో, దర్శకుడు ఎవరు..?
పూరిజగన్నాథ్ గురు రామ్ గోపాల్ వర్మ.. ఈ సినిమా మెయిన్ స్టోరీ లైన్ ని రాసుకున్నారు. రక్తచరిత్ర 2 తెరకెక్కిస్తున్న సమయంలో వర్మకి ఈ సినిమా స్టోరీ ఐడియా వచ్చింది. రక్తచరిత్ర 2లో నటిస్తున్న తమిళ స్టార్ హీరో 'సూర్య'కి వర్మ ఆ స్టోరీ లైన్ వినిపించారు. సూర్యకి బాగా నచ్చేయడంతో.. సినిమా చేద్దాం డెవలప్ చేయమని అడిగారట. దీంతో ఆర్జీవీ స్టోరీ డెవలప్ చేసే బాధత్యని తన శిష్యుడు పూరికి అప్పగించారు. ఇక పూరి ఆ స్టోరీ లైన్ ని బిజినెస్మెన్ గా డెవలప్ చేసి ఆర్జీవీ దగ్గరికి తీసుకు వెళ్లారు.
అయితే పూరినే ఆ సినిమాని తెరకెక్కించమని ఆర్జీవీ చెప్పడంతో, సూర్య దగ్గరకి డెవలప్ చేసిన ఆ కథని తీసుకోని వెళ్లి వినిపించారు. సూర్యకి కూడా బాగా నచ్చేసింది. కానీ అప్పటికే సూర్య చేతిలో చాలా కమిట్మెంట్స్ ఉండడంతో.. పూరిజగన్నాథ్ ఆ కథని తీసుకోని వెళ్లి మహేష్ దగ్గరికి వెళ్లారు. ఇక మహేష్ బాబు, పూరి తీసుకోని వచ్చిన బిజినెస్మెన్ కథని వినకుండానే సినిమా చేయడానికి ఒకే చెప్పేశారట. తనకి పోకిరి లాంటి హిట్టుని పూరి ఇవ్వడం వలనే మహేష్ ఆ నమ్మకంతోనే ఒకే చెప్పేశారట.
ఇక 2013 సంక్రాంతికి రిలీజైన ఈ చిత్రం.. ఫస్ట్ డివైడ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఆ తరువాత మెల్లిమెల్లిగా ఆడియన్స్ కి రీచ్ అయ్యి సూపర్ హిట్టుగా నిలిచింది. ముఖ్యంగా మూవీలో మహేష్ బాబు చెప్పిన డైలాగ్స్ యూత్ పై బాగా ఇంపాక్ట్ చూపించాయి.
Next Story