బ్రహ్మీని కాదని.. వెన్నెల వల్ల అవుతుందా?
శ్రీను వైట్ల అంటే కామెడీ.. కామెడీ అంటే శ్రీను వైట్ల అన్నట్టుగా ఉండే సినిమాలు కాస్తా.. శ్రీను వైట్ల అంటే బోర్ రొటీన్ కామెడీ అనే స్టేజ్ [more]
శ్రీను వైట్ల అంటే కామెడీ.. కామెడీ అంటే శ్రీను వైట్ల అన్నట్టుగా ఉండే సినిమాలు కాస్తా.. శ్రీను వైట్ల అంటే బోర్ రొటీన్ కామెడీ అనే స్టేజ్ [more]
శ్రీను వైట్ల అంటే కామెడీ.. కామెడీ అంటే శ్రీను వైట్ల అన్నట్టుగా ఉండే సినిమాలు కాస్తా.. శ్రీను వైట్ల అంటే బోర్ రొటీన్ కామెడీ అనే స్టేజ్ కి వెళ్లాయి. దూకుడు, ఢీ, రెడీ లాంటి బ్లాక్ బస్టర్ కామెడీ హిట్స్ ఉన్న శ్రీను వైట్లకి అమర్ అక్బర్ ఆంటోని సినిమా లాగి కొట్టింది. దెబ్బకి దెయ్యం దిగింది. శ్రీను వైట్ల తో సినిమా అనగానే హీరోలు పారిపోతున్నారు. అయితే శ్రీను వైట్లకి మంచు విష్ణు ఢీ సీక్వెల్ అవకాశం ఇచ్చాడు. లాక్ డౌన్ సమయంలో ఢీ సీక్వెల్ స్క్రిప్ట్ రెడీ చేసాడట శ్రీను వైట్ల. అయితే ఢీ సినిమాకి బ్రహ్మానందం కామెడీ హైలెట్. చారి పాత్రలో ఢీ లో బ్రహ్మి చెలరేగి పోయి కామెడీ చేసాడు,. నన్ను ఇన్వాల్వ్ చెయ్యొద్దు రాజుగారు అంటూ మంచు విష్ణు తో బ్రహ్మి చేసిన కామెడీ హైలెట్.
అయితే ఇప్పుడు ఢీ సీక్వెల్ లో శ్రీను వైట్ల బ్రహ్మి కేరెక్టర్ లో వెన్నెల కిషోర్ ని తీసుకోబోతున్నాడట. కమెడియన్ గా చాలా సినిమాలు చేసి హిట్ కొట్టి.. ప్రస్తుతం ఫుల్ ట్రాక్ లో ఉన్న వెన్నెల కిషోర్ ని చారి పాత్రలో నటింపచేయాలని శ్రీను వైట్ల ఆలోచనట. వెన్నెల కిషోర్ పాత్ర ద్వారానే కామెడీ పండించాలని.. ఆ కామెడీ సినిమాకి హైలెట్ అయ్యేలా ఉంటుంది అని అంటున్నారు. అయితే బ్రహ్మి చేసిన కామెడీ.. వెన్నెల వల్ల అవుతుందా అంటున్నారు కామెడీ ప్రియులు. ఈ ఏడాది చివరిలో మొదలు కాబోయే ఢీ సీక్వెల్ లో వెన్నెల కిషోర్ చారి పాత్రకి.. అలాగే ప్రస్తుతం రియల్ హీరో అనిపించుకుంటున్న సోను సూద్ ని ఢీ సినిమాలోని శ్రీహరి పాత్రకి తీస్కోవాలని శ్రీను వైట్ల అనుకుంటున్నాడట. ఢీ లో శ్రీహరి కేరెక్టర్ కూడా హైలెట్. ప్రస్తుతం ఆయన లేకపోవడంతో ఆ కేరెక్టర్ కి సోను సూద్ ని ప్రిఫర్ చేస్తున్నారట.