Mon Dec 23 2024 07:22:28 GMT+0000 (Coordinated Universal Time)
Lokesh Kanagaraj : లోకేష్ కనగరాజ్పై కేసు నమోదు.. ఎందుకో తెలుసా..?
లోకేష్ కనగరాజ్ కి మానసిక సమస్య ఉందని, ఆయనకు మానసిక పరీక్షలు నిర్వహించాలంటూ కోర్టులో కేసు ఫైల్ చేశారు. అసలు విషయం ఏంటి..?
Lokesh Kanagaraj : తమిళ స్టార్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ పై కేసు నమోదు అయ్యింది. మధురై హైకోర్టులో లోకేష్ పై పిటీషన్ దాఖలైంది. ఖైదీ, విక్రమ్, లియో సినిమాలతో సౌత్ స్టార్ ఇమేజ్ ని సంపాదించుకున్న లోకేష్ కనగరాజ్ కి మానసిక సమస్య ఉందని, ఆయనకు మానసిక పరీక్షలు నిర్వహించాలంటూ కేసు ఫైల్ చేశారు. ఇంతకీ అసలు విషయం ఏంటి..?
లోకేష్ డైరెక్ట్ చేసిన రీసెంట్ మూవీ 'లియో' ఇటీవల రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. డ్రగ్స్ నేపథ్యంతో సాగే ఈ కథలో మారణాయుధాలు, మతపరమైన చిహ్నాలు, మహిళలు మరియు చిన్నారులపై హింసని ప్రేరేపించేలా సీన్స్ ఉన్నాయనంటూ పిటిషన్ దాఖలు చేశారు. లియో చిత్ర దర్శకుడు లోకేష్ కనగరాజ్కి మానసిక సమస్య ఉందని, అందుకనే అతని సినిమాల్లో ఎక్కువ వైలెన్స్ అండ్ డ్రగ్స్ చుట్టూనే కథలు ఉంటాయని పేర్కొన్నారు.
అతనికి మానసిక సంబంధిత పరీక్షలు నిర్వహించాలంటూ న్యాయస్థానానికి తెలియజేశారు. ఇక ఈ విషయం పై ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇక ఈ వార్త ప్రస్తుతం ఫిలిం వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. సినిమా రిలీజ్ అయ్యిపోయే, ఓటీటీలోకి కూడా వచ్చేసిన చాలా కాలం తరువాత.. ఇప్పుడు ఈ చిత్రం పై కేసు వేయడం విచిత్రంగా ఉందని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.
కాగా లోకేష్ కనగరాజ్ ప్రస్తుతం రజినీకాంత్ తో తెరకెక్కించబోయే సినిమా స్క్రిప్ట్ పనుల్లో ఉన్నారు. ఈ చిత్రం తరువాత ఖైదీ 2, లియో 2 సినిమాలు చేయనున్నారు. ఈ చిత్రాలు పై ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ రెండు చిత్రాలు లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా ఆడియన్స్ ముందుకు రాబోతున్నాయి. అయితే రజిని సినిమా.. ఆ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా తెరకెక్కుతుందా అనేది సందేహంగా మారింది.
Next Story