Wed Nov 06 2024 01:53:57 GMT+0000 (Coordinated Universal Time)
పవన్ కల్యాణ్ పాటతో ఫేమస్.. కిన్నెర మొగులయ్యను వరించిన పద్మశ్రీ
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమాలో.. టైటిల్ సాంగ్ పాడిన కిన్నెర మొగులయ్య బాగా ఫేమస్ అయ్యారు. ఆ పాట
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమాలో.. టైటిల్ సాంగ్ పాడిన కిన్నెర మొగులయ్య బాగా ఫేమస్ అయ్యారు. ఆ పాట పాడక ముందు వరకూ.. మొగులయ్య చాలా తక్కువమందికి పరిచయం. ఒక్కపాటతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఫేమస్ అయ్యారు ఆయన. అంతరించిపోతోన్న కిన్నెర కళని బతికిస్తోన్న మొగులయ్యను పద్మశ్రీ వరించింది. కేంద్రప్రభుత్వం నిన్న ప్రకటించిన పద్మ పురస్కారాల్లో మొగులయ్య పేరు కూడా ఉంది. పద్మశ్రీ అవార్డు రాకతో.. మొగులయ్య మరోసారి వార్తల్లో నిలిచారు.
Also Read : మెగాస్టార్ కు మరోసారి కరోనా
తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లా తెల్కపల్లి మండలానికి చెందిన మొగులయ్య.. తన తాతల నుంచి అందిన 12 మెట్ల కిన్నెరతోనే జీవనం గడుపుతున్నారు. తాత ముత్తాతల కాలం నాటి నుంచి వస్తోన్న జానపద కళకు ఆయన ప్రాణం పోస్తున్నారు. చుట్టుపక్కల ఊళ్లు తిరుగుతూ.. కిన్నెర కళను అందరికీ పరిచయం చేస్తున్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ మొగులయ్యను మర్యాదపూర్వకంగా సత్కరించారు. ఆ తర్వాత ఆయన చరిత్రను 8వ తరగతి సిలబస్ లో చేర్చారు. దీంతో అప్పుడప్పుడు స్కూళ్లకు వెళ్లి ప్రదర్శనలు కూడా ఇచ్చారు. ఆ తర్వాత పవన్ కల్యాణ్ సినిమాలో భీమ్లా నాయక్ పాటకు జానపదం పాడటంతో.. మళ్లీ తెరపైకి వచ్చారు మొగులయ్య. తాజాగా కేంద్రం తనకు పద్మశ్రీ ప్రకటించడంపై సంతోషం వ్యక్తం చేశారాయన.
Next Story