Mon Dec 23 2024 01:51:39 GMT+0000 (Coordinated Universal Time)
నందమూరి కుటుంబం నుంచి మరో హీరో.. BREATHE పోస్టర్ లాంచ్
ఇందులో చైతన్య వర్షంలో గొడుగు పట్టుకుని, చెవిలో బ్లూటూత్ పెట్టుకొని ఇంటెన్స్ లుక్ లో కనిపిస్తున్నాడు.
టాలీవుడ్ లో నందమూరి తారకరామారావు వారసులంటే గుర్తొచ్చేది బాలకృష్ణ, ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, తారకరత్న. ఇప్పుడు ఆ కుటుంబం నుంచి మరో వ్యక్తి హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. సీనియర్ ఎన్టీఆర్ పెద్దకుమారుడైన జయకృష్ణ కొడుకు చైతన్య కృష్ణ ఈ ఏడాదే హీరోగా ఇండస్ట్రీలో అడుగు పెట్టబోతున్నాడు. ఇప్పటికే సినిమా షూటింగ్ కూడా మొదలవ్వగా.. నేడు (మార్చి 5) సినిమా టైటిల్ ను అనౌన్స్ చేస్తూ.. అధికారికంగా సినిమాను ప్రకటించారు. హీరో కల్యాణ్ రామ్ చేతులమీదుగా పోస్టర్ ను రిలీజ్ చేశారు.
ఈ సినిమాకి BREATHE అనే టైటిల్ ను ఖరారు చేయగా.. అంతిమ పోరాటం అనే పవర్ ట్యాగ్ లైన్ ఇచ్చారు. పోస్టర్ తో పాటు చైతన్య కృష్ణ ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేశారు. ఇందులో చైతన్య వర్షంలో గొడుగు పట్టుకుని, చెవిలో బ్లూటూత్ పెట్టుకొని ఇంటెన్స్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఈ సందర్భంగా కల్యాణ్ రామ్ మాట్లాడుతూ.. పోస్టర్ చూస్తుంటే చాలా ఇంటరెస్టింగ్ గా ఉంది. ఈ సినిమాతో నిర్మాతగా మా పెదనాన్న, హీరోగా మా అన్నయ్య సక్సెస్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని పేర్కొన్నాడు. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోన్న BREATHEను నందమూరి జయకృష్ణ బసవతారకం క్రియేషన్స్ పతాకం పై మొదటి ప్రాజెక్ట్ గా నిర్మిస్తున్నారు. వంశీకృష్ణ ఆకెళ్ళ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.
Next Story