Mon Dec 23 2024 06:39:03 GMT+0000 (Coordinated Universal Time)
చలాకి చంటికి ఏమైంది ? ఇప్పుడు అతని ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది ?
గుండెపోటుకు గురైన చంటిని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారని ఆ వార్త సారాంశం.
జబర్దస్త్.. ఎంతో మందికి జీవితాన్నిచ్చిన కామెడీ షో ఇది. ఈ షో ద్వారానే చలాకీ చంటికి మంచి పేరొచ్చింది. కమెడియన్ గా కడుపుబ్బా నవ్వించిన చంటి.. నెమ్మదిగా సినిమాల్లోనూ నటిస్తూ.. కెరీర్ ను ఏర్పరచుకున్నాడు. గతేడాది బిగ్ బాస్ -6లోనూ చంటి కంటెస్టంట్ గా వచ్చాడు. ఇప్పుడు అప్పుడప్పుడు సినిమాల్లో కనిపిస్తున్నాడు. ఇదివరకులా పెద్దగా కామెడీ షోలలో కనిపించడం లేదు.
అయితే.. ఈ రోజు చలాకి చంటి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడని ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గుండెపోటుకు గురైన చంటిని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారని ఆ వార్త సారాంశం. అయితే తొలుత ఈ విషయాన్ని ఎవరూ నమ్మలేదు. కానీ.. ఆయన సన్నిహిత వర్గాలు చెప్పినదాన్ని బట్టి నిజమేనని తెలుస్తోంది. ప్రస్తుతం ఆస్పత్రిలో ఉన్న చంటి ఆరోగ్యం నిలకడగా ఉందని సమాచారం. చంటి పూర్తిగా కోలుకున్నాక డిశ్చార్జ్ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో వయసుతో సంబంధం లేకుండా ఎంతోమంది గుండెపోటుకు గురై మరణిస్తున్నారు. ఈ నేపథ్యంలో చలాకీ చంటికి కూడా గుండెపోటు వచ్చిందన్న వార్త ఆయన అభిమానులను కలవరపరిచింది. ఈ విషయంపై ఆయన కుటుంబ సభ్యుల నుండి ఎలాంటి అధికారిక సమాచారం అందలేదు.
Next Story