Wed Dec 04 2024 01:15:54 GMT+0000 (Coordinated Universal Time)
Chandra Mohan : ఆయన లైఫ్ లో ఎన్నో సంచలనాలు, ఏంటో తెలుసా?
చంద్రమోహన్ భార్య పెద్ద రచయిత్రి. ఇక ఈయనతో కలిసి సినిమా చేస్తే చాలు ఆ హీరోయిన్ కెరీర్..
Chandra Mohan : టాలీవుడ్ సీనియర్ నటుడు చంద్రమోహన్ ఈరోజు (నవంబర్ 11) ఉదయం 9.45 గంటలకు హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న ఈ నటుడు.. ఇటీవల హృద్రోగంతో హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. ఇక ఆసుపత్రిలోనే చికిత్స పొందుతూ వస్తున్న చంద్రమోహన్.. నేడు తుది శ్వాస విడిచారు. కాగా చంద్రమోహన్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా..?
చంద్రమోహన్ ఆంధ్రప్రదేశ్ కృష్ణాజిల్లా 'పమిడిముక్కల' గ్రామంలో మే 23, 1943లో జన్మించారు. ఈయన అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర రావు. 1966లో 'రంగులరాట్నం' సినిమాలో హీరోగా నటించి యాక్టింగ్ కెరీర్ ని స్టార్ట్ చేశారు. హీరోగా దాదాపు 175 చిత్రాల్లో నటించారు. అలాగే ప్రతినాయకుడిగా, కమెడియన్‌గా, సపోర్టింగ్ ఆర్టిస్ట్‌గా నటించిన చంద్రమోహన్.. 900కు పైగా సినిమాల్లో నటించారు. వీటిలో కొన్ని తమిళ్ సినిమాలు కూడా ఉన్నాయి. చివరిగా 2017లో గోపీచంద్ హీరోగా తెరకెక్కిన 'ఆక్సిజన్' సినిమాలో నటించిన చంద్రమోహన్.. ఆ తరువాత నుంచి అనారోగ్య సమస్యలతో నటనకు దూరంగా ఉంటూ వస్తున్నారు.
52ఏళ్ళ కెరీర్ లో చంద్రమోహన్ ఏ ఇయర్ కూడా మేకప్ లేకుండా లేరట. అంత బిజీ యాక్టర్ గా సంవత్సరానికి 20 పైగా సినిమాలు చేస్తూ వచ్చారని, అది ఏ నటుడికి సాధ్యం కాలేదని ఆయన భార్య జలంధర ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. చంద్రమోహన్ భార్య జలంధర పెద్ద రచయిత్రి. దాదాపు 100కి పైగా కథలు, పలు నవలలు రాసిన జలంధర.. అనేక సాహితీ పురస్కారాలు కూడా అందుకున్నారు.
ఈ దంపతులు ఇద్దరికీ మధుర మీనాక్షి, మాధవి అని ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. అమెరికాలో ఉన్న మధుర మీనాక్షి సైకాలజిస్ట్‌గా, చెన్నైలో ఉంటున్న మాధవి డాక్టర్‌గా కొనసాగుతూ వస్తున్నారు. చంద్రమోహన్.. దివంగత దర్శకుడు కె విశ్వనాధ్‌కి బంధువు అవుతారు. తన ఎదుగుదలలో విశ్వనాథ్ సహాయం కూడా ఉందని చంద్రమోహన్ చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. చెన్నైలో పక్కపక్కనే ఇల్లు కట్టుకొని చంద్రమోహన్, విశ్వనాథ్ పాతకేళ్లు పాటు అక్కడే ఉన్నారు.
ఇక ఇండస్ట్రీలో ఒక సెంటిమెంట్ ఉంది. చంద్రమోహన్ పక్కన హీరోయిన్ గా నటిస్తే చాలు ఆమె కెరీర్ గ్రాఫ్ అమాంతం పెరిగిపోతుందని అందరూ నమ్ముతారు. ఎందుకంటే జయప్రద, శ్రీదేవి, జయసుధ, వాణిశ్రీ, విజయనిర్మల, మంజుల, విజయశాంతి, చంద్రకళ.. ఇలా ఎంతోమంది చంద్రమోహన్ పక్కన నటించిన తరువాత అగ్రస్థానానికి వెళ్లారు. అయితే వారి ఎదుగుదలలో తన పాత్ర ఏం లేదని, అది ఆ హీరోయిన్ల అదృష్టం, ప్రతిభ కారణం అని చంద్రమోహన్ చెప్పుకొస్తారు.
'రంగులరాట్నం' సినిమాతో నటుడిగా పరిచయమైన చంద్రమోహన్.. తన కెరీర్ లో ఆరు నంది అవార్డులు, రెండు ఫిలింఫేర్ అవార్డులను అందుకున్నారు. సిరిసిరి మువ్వ, పదహారేళ్ళ వయసు సినిమాలకు బెస్ట్ యాక్టర్ గా ఫిలింఫేర్ అవార్డులను అందుకున్నారు. ఆ తరువాత పలు సినిమాల్లో కమెడియన్ గాఎం సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా నంది అవార్డులను అందుకున్నారు.
Next Story