Thu Dec 19 2024 16:36:49 GMT+0000 (Coordinated Universal Time)
పుష్ప సినిమాలో నేను ఉన్నా.. చంద్రబాబు నాయుడు కామెంట్స్..
విలేకర్లతో జరిపిన ఇష్టాగోష్టిలో చంద్రబాబు కూడా మాట్లాడుతూ.. పుష్ప సినిమాలో నేను ఉన్నానని వైకాపా వాళ్లు ఏడుస్తున్నారు అని చెప్పుకొచ్చారు. ఇంతకీ చంద్రబాబు..
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా తెరకెక్కిన ‘పుష్ప’ (Pushpa) పాన్ ఇండియా వైడ్ ఘనం విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇక ఇటీవల ఆ సినిమాకు గాను అల్లు అర్జున్, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ (Devi Sri Prasad) నేషనల్ అవార్డ్స్ అందుకోవడంతో.. ప్రస్తుతం 'పుష్ప' హాట్ టాపిక్ అయ్యిపోయింది.
ఇక ఈ అవార్డులు వచ్చినందుకు ఏపీ సీఎం జగన్ (YS Jagan), తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) చిత్ర యూనిట్ సోషల్ మీడియా ద్వారా అభినందించడం కూడా జరిగింది. ఇది ఇలా ఉంటే.. చంద్రబాబు నాయుడు పుష్ప సినిమాలో ఉన్నారంటూ సోషల్ మీడియాలో ఒక ఫోటో వైరల్ అవుతుంది. ఇక ఈ విషయంపై విలేకర్లతో జరిపిన ఇష్టాగోష్టిలో చంద్రబాబు కూడా మాట్లాడారు.
"పుష్ప సినిమాలో నేను ఉన్నానని, నా ఫోటోని కొన్ని సన్నివేశంలో చూపించారని వైకాపా వాళ్లు ఏడుస్తున్నారు. సినిమాలోని కొన్ని సీన్స్ బ్యాక్ గ్రౌండ్ లో నా ఫోటో ఉంటుంది. మూవీలో చూపించిన టైంలో నేను సీఎంగా ఉన్నానని ఆ ఫోటో పెట్టారా..? లేదా ఎర్రచందనం స్మగ్లర్లను నేను కంట్రోల్ చేశానని నా ఫోటో పెట్టారో తెలియదు. కానీ దానికే వైసీపీ వాళ్ళు ఏడుస్తున్నారు. ఇక సినిమాలో ఎర్రచందనం స్మగ్లర్ గా మెప్పించిన అల్లు అర్జున్కి జాతీయ అవార్డు ఇస్తే, నిజమైన స్మగ్లర్లు అయిన వైకాపా వాళ్ళకి ఏ అవార్డు ఇవ్వాలి?" అంటూ ప్రశ్నించారు.
ఇక పుష్ప 2 విషయానికి వస్తే.. పార్ట్ 1 సూపర్ హిట్ అవ్వడమే కాకుండా, ఇప్పుడు నేషనల్ అవార్డ్స్ రావడంతో పార్ట్ 2 పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. మరి ఈ అంచనాలను సుకుమార్ ఎలా మేనేజ్ చేస్తాడో చూడాలి. కాగా ఈ మూవీని వచ్చే ఏడాది మార్చి 22న రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంటే ఫహద్ ఫాసిల్ విలన్ గా కనిపించబోతున్నాడు.
Next Story