Mon Dec 23 2024 06:43:47 GMT+0000 (Coordinated Universal Time)
చంద్రముఖి 2లో కాంట్రవర్సీ క్విన్ కంగనా ఫస్ట్ లుక్..
సూపర్ స్టార్ రజనీకాంత్ -నయనతార-జ్యోతిక ప్రధాన పాత్రల్లో నటించిన సినిమాకు రాఘవ లారెన్స్ హీరోగా సీక్వెల్ తెరకెక్కిస్తు..
2005 సంవత్సరంలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన హార్రర్ జోన్ ఫిలిం.. చంద్రముఖి చిత్రానికి సిక్వెల్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. సూపర్ స్టార్ రజనీకాంత్ -నయనతార-జ్యోతిక ప్రధాన పాత్రల్లో నటించిన సినిమాకు రాఘవ లారెన్స్ హీరోగా సీక్వెల్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు చంద్రముఖి డైరెక్టర్ పి.వాసు దర్శకత్వం వహిస్తుండగా.. సీనియర్ నటి రాధిక కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ కాంట్రవర్సీ క్వీన్ కంగనా లీడ్ రోల్ లో నటిస్తోందని కొద్దిరోజులుగా వార్తలొస్తున్నాయి. తాజాగా.. ఆ వార్తలను నిజం చేస్తూ.. నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ కంగనా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసింది.
కంగనా తో పాటు లక్ష్మీ మీనన్ కూడా ఫీ మేల్ లీడ్ లో కనిపించనుంది. హార్రర్ జోనర్లో వచ్చి బ్లాక్ బాస్టర్ హిట్టుగా నిలిచిన చంద్రముఖికి సీక్వెల్గా వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. కాగా.. పార్ట్ 1 లో తన కామెడీ టైమింగ్ తో అందరినీ నవ్వించిన వడివేలు కూడా చంద్రముఖి 2 లో సందడి చేయబోతున్నాడు. ఈ సినిమాకు ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు.
Next Story