ఆ సినిమా విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి..!
ఇతర భాషల్లో ఏమో కానీ టాలీవుడ్ లో, కోలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ ఇమేజ్ ఉంటెనే సినిమాలు ఎక్కువ కలెక్ట్ చేసేవి. వంద రోజులు ఆడేవి. కానీ [more]
ఇతర భాషల్లో ఏమో కానీ టాలీవుడ్ లో, కోలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ ఇమేజ్ ఉంటెనే సినిమాలు ఎక్కువ కలెక్ట్ చేసేవి. వంద రోజులు ఆడేవి. కానీ [more]
ఇతర భాషల్లో ఏమో కానీ టాలీవుడ్ లో, కోలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ ఇమేజ్ ఉంటెనే సినిమాలు ఎక్కువ కలెక్ట్ చేసేవి. వంద రోజులు ఆడేవి. కానీ ఇప్పుడు అటువంటి పరిస్థితులు లేవనుకోండి. ఎంత స్టార్ హీరో అయినా సినిమాలో కంటెంట్ ఉంటేనే జనాలు థియేటర్స్ కి వస్తున్నారు. అది కూడా సినిమా బాగుందని టాక్ బయటికి వస్తే తప్ప ప్రేక్షకులు సినిమాలని చూడటానికి ఇస్తా పడడం లేదు. రజనీ లాంటి స్టార్ హీరోకే 2.0తో కమర్షియల్ ఫెయిల్ తప్పులేదు. అలానే ఈ సంక్రాంతికి వినయ విధేయ రామ డిజాస్టర్ మీదకు మళ్లుతోంది. బిజినెస్ అయితే 90 కోట్లు చేసింది కానీ వసూళ్లు మాత్రం 50 కోట్లు దాటడమే గొప్ప అనేలా ఉంది పరిస్థితి.
అప్రమత్తం కాకపోతే…
మరి ఈ నేపథ్యంలో 150 కోట్లు పెట్టి చిరంజీవితో సురేందర్ రెడ్డి చేస్తున్న సైరా నరసింహారెడ్డి మీద దీని ప్రభావం ఉంటుందా అనే చర్చలు మొదలయ్యాయి. రీఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ పై బయ్యర్లు అంత పెట్టడానికి ఇష్టపడతారా లేదా చూడాలి. ఈ సినిమాకి చరణ్ నిర్మాత కాబట్టి వ్యాపార లావాదేవీలు ఇప్పటి నుంచే వేగవంతం చేయాలి. ప్రమోషన్స్ చేసి ఎదో ఒక రకంగా ఈ సినిమాను అమ్మేయాలని అంతే కానీ రిస్క్ తీసుకోకూడదని ట్రేడ్ వాళ్లు చెబుతున్నారు. మల్టీ లాంగ్వేజ్ చిత్రం కాబట్టి మరింత ప్రమోషన్స్ చేయాలి. లేకపోతే 2.0, వినయ విధేయ రామ సినిమాలకు పట్టిన గతే పడుతుందంటున్నారు.