Fri Jan 10 2025 14:43:17 GMT+0000 (Coordinated Universal Time)
టాలీవుడ్ స్టార్ హీరో, అతని తండ్రిపై చీటింగ్ కేసు నమోదు
ప్రముఖ ప్రొడ్యూసర్ బెల్లంకొడ సురేష్, హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లపై ఒక ఫైనాన్షియర్ చీటింగ్ కేసు పెట్టారు. వివరాల్లోకి వెళ్తే..
హైదరాబాద్ : సినీ పరిశ్రమ అన్నాక నిర్మాతలకు.. ఫైనాన్షియర్లకు గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఒక్కోసారి అవి కేసుల వరకూ దారి తీస్తాయి. తాజాగా టాలీవుడ్ స్టార్ హీరో విషయంలోనూ అదే జరిగింది. ప్రముఖ ప్రొడ్యూసర్ బెల్లంకొడ సురేష్, హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లపై ఒక ఫైనాన్షియర్ చీటింగ్ కేసు పెట్టారు. వివరాల్లోకి వెళ్తే.. బెల్లంకొండ సురేష్ శ్రవణ్ కుమార్ అనే వ్యక్తి వద్ద కొత్త సినిమా నిమిత్తం 2018-19 మధ్యలో రూ.50 లక్షలు తీసుకున్నాడని, ఆ తర్వాత గోపీచంద్ మలినేని తో ఒక సినిమా చేస్తున్నామని మరికొంత డబ్బు తీసుకున్నారని శ్రవణ్ ఫిర్యాదు లో పేర్కొన్నాడు.
డబ్బు తీసుకున్న తర్వాత సినిమా గురించి ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో.. తన డబ్బులు తిరిగివ్వాలని అడిగితే.. చంపేస్తామని బెదిరిస్తున్నారని, వారికి భయపడి తాను కోర్టును ఆశ్రయించినట్లు శ్రవణ్ చెప్పుకొచ్చాడు. కోర్టు ఆదేశాలతో శ్రవణ్ కుమార్ ఇచ్చిన ఆధారాల ఆధారంగా బంజారాహిల్స్ పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. ఈ వార్తలపై బెల్లంకొండ ఫ్యామిలీ ఇంతవరకూ స్పందించలేదు. ఇందులో నిజమెంతో తెలియాలంటే వాళ్లు స్పందించాల్సిందే.
Next Story