సోనాక్షి సిన్హా పై కేసు
బాలీవడ్ లో దబాంగ్-1, దబాంగ్-2, అఖిర, రౌడీ రాథోడ్, రాజ్ కుమార్, సన్ ఆఫ్ సర్దార్, లుటేరా, హాలీడే సినిమాల్లో అందరిని మెపించిన సోనాక్షి సిన్హా ప్రస్తుతం ఇబ్బందుల్లో ఉంది. ఈమెపై..ఈమె మేనేజర్ పై ఇండియన్ ఫ్యాషన్ అండ్ బ్యూటీ అవార్డ్స్ కంపెనీ వారు మురాదాబాద్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. మరో ఐదుగురు పై కూడా కేసు వేశారు. తమను వీరంతా మోసం చేసారని పోలీసులను ఆశ్రయించింది ఆ సంస్థ.
ఒక ప్రోగ్రామ్ కోసం సోనాక్షి సిన్హా కు రూ.28 లక్షలు చెల్లించామని ఆ కంపెనీ కంప్లైంట్ లో పేరుకుంది. అయితే సోనాక్షి ఆ కార్యక్రమం అటెండ్ కాకపోవడంతో తాము ఇచ్చిన డబ్బు తిరిగి ఇచ్చేయాలని కోరితే ఆమె అందుకు నిరాకరిస్తోందని తెలిపారు. ఆమె రాకపోకల కోసం విమానం టికెట్స్ కూడా కొన్నామని చెప్పారు. అయితే ఆ డబ్బుని తిరిగి ఇచ్చేయాలని గట్టిగా కోరడంతో తమను చంపేస్తామని సోనాక్షి మానేజర్ ప్రమోద్ శర్మ అంటున్నాడని ఆ సంస్థ ఫిర్యాదులో పేర్కొంది.
తమకు ఎలా అయిన న్యాయం చేయమని...ఆ డబ్బు ఆమె తిరిగి ఇచ్చేలా చేయండి అని ఆ సంస్థ ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసుకున్న మురాదాబాద్ పోలీసులు ఈ వ్యవహారంపై చీటింగ్ కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. త్వరలోనే ఈ కేసు ఒక కొలిక్కి రానుంది. కోలీవుడ్ లో 'లింగ' తో రజినీకాంత్ పక్కన చేసే ఛాన్స్ కొట్టేసింది సోనాక్షి