Mon Dec 23 2024 13:40:15 GMT+0000 (Coordinated Universal Time)
ఇండస్ట్రీలో విషాదం.. ఛెల్లో షో చైల్డ్ ఆర్టిస్ట్ మృతి
ప్రధాన పాత్రలో నటించిన సమయ్ ప్రాణ స్నేహితుడిగా కనిపించాడు రాహుల్. రాహుల్ మరణంతో ఇండస్ట్రీలో విషాద ఛాయలు..
![chhellow show child artist rahul koli, rahul koli died chhellow show child artist rahul koli, rahul koli died](https://www.telugupost.com/h-upload/2022/10/11/1424271-chhlo-show.webp)
సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ఆస్కార్ అవార్డుకు ఎంపికైన ఛెల్లో షో సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ కన్నుమూశాడు. బాలనటుడు రాహులో కోలీ (15) కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో అతని ఆరోగ్యం విషమించి అక్టోబర్ 2న మరణించినట్లు రాహుల్ తండ్రి తెలిపారు. అతను నటించిన ఛెల్లో షో సినిమా 95వ ఉత్తమ అంతర్జాతీయ చలనచిత్ర విభాగం భారత్ తరపున ఆస్కార్ కు నామినేట్ అయింది.
ఆ సినిమాలో నటించిన ఆరుగురు చిన్నారుల్లో రాహుల్ కూడా ఒకడు. ప్రధాన పాత్రలో నటించిన సమయ్ ప్రాణ స్నేహితుడిగా కనిపించాడు రాహుల్. రాహుల్ మరణంతో ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అతని మరణంపట్ల సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణానికి ముందు రాహుల్ తీవ్ర జ్వరంతో బాధపడ్డాడని, రక్తపు వాంతులు చేసుకున్నాడని అతని తండ్రి తెలిపారు. గుజరాత్ ప్రాంతంలోని ఓ గ్రామంలో చిన్నతనంలోనే సినిమాల పట్ల ఆకర్షితుడైన పాన్ నలిన్ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. తొమ్మిదేళ్ల బాలుడు సినిమాల పట్ల ఉన్న ప్రేమతో తన జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు అనేది ఛెల్లో షో.
Next Story