Thu Dec 19 2024 23:14:40 GMT+0000 (Coordinated Universal Time)
Animal : తెలుగు బిగ్బాస్ కంటెస్టెంట్.. 'యానిమల్'లోని సాంగ్కి డాన్స్ కంపోజ్ చేశాడా..?
'యానిమల్'లోని ‘చిన్ని చిన్ని ఆశ’ మ్యూజిక్ బిట్ కి తెలుగు బిగ్బాస్ 7 కంటెస్టెంట్ డాన్స్ కంపోజ్ చేశాడా..?
Animal Movie : రణబీర్ కపూర్, రష్మిక మందన్న, తృప్తి దిమ్రీ హీరోహీరోయిన్లుగా సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేసిన యాక్షన్ వైలెంట్ మూవీ 'యానిమల్'. ప్రస్తుతం ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తుంది. సోషల్ మీడియా టైం లైన్ కూడా ఈ మూవీ ఫీడ్ తోనే ఫుల్ అయ్యిపోతుంది. ఇక ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను నెటిజెన్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తున్నారు.
ఈక్రమంలోనే ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ చేసిన ‘చిన్ని చిన్ని ఆశ’ మ్యూజిక్ బిట్ కి రణబీర్ డాన్స్ వేస్తున్న ఓ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అయితే ఈ మ్యూజిక్ బిట్ కి డాన్స్ కోరియోగ్రఫీ చేసింది తెలుగు బిగ్బాస్ 7 కంటెస్టెంట్ అంటా. ఈ విషయం ఆ కంటెస్టెంటే తెలియజేశాడు. ఇంతకీ ఎవరు ఆ కంటెస్టెంట్ అని ఆలోచిస్తున్నారా..?
టాలీవుడ్ లో ఆట సందీప్ గా పేరు తెచ్చుకున్న డాన్సర్.. యానిమల్ మూవీలోని ‘చిన్ని చిన్ని ఆశ’ మ్యూజిక్ బిట్ కి డాన్స్ కంపోజ్ చేశాడట. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రణబీర్ డాన్స్ వీడియోని షేర్ చేస్తూ.. 'ఆ మ్యూజిక్ బిట్ కి తానే డాన్స్ కంపోజ్ చేశాడని' పేర్కొన్నాడు. అలాగే మూవీలో తనకి ఇంత మంచి అవకాశం ఇచ్చిన సందీప్ వంగకి కృతజ్ఞతలు కూడా తెలియజేశాడు.
ఇక ఈ పోస్టు చూసిన అభిమానులు షాక్ అవుతున్నారు. ఇంత వైరల్ అవుతున్న మ్యూజిక్ బిట్ ని ఆట సందీప్ చేశాడని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కాగా సందీప్ 'ఆట' డాన్స్ షోతో మంచి గుర్తింపు సంపాదించుకొని.. ఆ షో పేరునే తన ఇంటి పేరుగా మార్చుకున్నాడు. ఇక ఇటీవల తెలుగు బిగ్బాస్ సీజన్ 7లో కంటెస్టెంట్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి.. దాదాపు ఎనిమిది వారలు ఉండి ఎలిమినేట్ అయ్యాడు.
ఇక బిగ్బాస్ విషయానికి వస్తే.. నెక్స్ట్ వీక్ తో సీజన్ 7 ముగియనుంది. ప్రస్తుతం హౌస్ లో శివాజీ, ప్రశాంత్, యావర్, అమర్, అర్జున్, శోభాశెట్టి, ప్రియాంక కంటెస్టెంట్స్ మిగిలారు. మరి వీరిలో టైటిల్ ఎవరు గెలుచుకుంటారో చూడాలి. గత ఆరు సీజన్లు అబ్బాయిలే టైటిల్స్ గెలుచుకున్నారు. ఈసారైనా అమ్మాయి టైటిల్ సొంతం చేసుకుంటుందేమో చూడాలి.
Next Story