Mon Dec 23 2024 13:35:15 GMT+0000 (Coordinated Universal Time)
ట్రోల్స్ పై టాలీవుడ్ లో హీట్... నేడు ఒకే వేదికపై మోహన్ బాబు, చిరంజీవి
చిరంజీవి, మోహన్ బాబు ఒకే వేదికపై నేడు కన్పించనున్నారు. దీంతో మాటల యుద్ధం జరుగుతుందన్న ఉత్కంఠ చిత్ర పరిశ్రమలో నెలకొంది.
చిరంజీవి, మోహన్ బాబు ఒకే వేదికపై నేడు కన్పించనున్నారు. దీంతో మాటల యుద్ధం జరుగుతుందన్న ఉత్కంఠ చిత్ర పరిశ్రమలో నెలకొంది. ఈరోజు ఫిలింనగర్ కల్చరల్ క్లబ్ లో టాలీవుడ్ ప్రముఖుల సమావేశం జరగనుంది. 24 క్రాఫ్ట్స్ కు చెందిన 240 మంది ఈ సమావేశాలకు హాజరుకానున్నారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ తో సమావేశమయ్యాక టాలీవుడ్ ప్రముఖులు తొలి సారిగా సమావేశం కానున్నారు.
జగన్ తో సమావేశం....
జగన్ తో సమావేశానికి మంచు కుటుంబానికి ఆహ్వానం అందలేదు. ఆ తర్వాత మంత్రి పేర్ని నాని స్వయంగా వచ్చి మోహన్ బాబును కలిశారు. తర్వాత మంచు విష్ణు జగన్ తో భేటీ అయ్యారు. అయితే ఇటీవల మోహన్ బాబు తన కుటుంబంపై ట్రోల్స్ చేయిస్తుంది ఇద్దరు హీరోలేనని సంచలన వ్యాఖ్యలు చేశారు.
మా ఎన్నికల నాటి నుంచి....
మూవీ ఆర్టిస్స్ అసోసియేషన్ ఎన్నికల నుంచి చిరంజీవి, మోహన్ బాబుల మధ్య గ్యాప్ పెరిగింది. దీంతో ఈ సమావేశంలో మోహన్ బాబు ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మోహన్ బాబు ఖచ్చితంగా తన కుటుంబంపై జరుగుతున్న ట్రోల్స్ విషయాన్ని ప్రస్తావిస్తారంటున్నారు. ఇప్పటికే మోహన్ బాబు లీగల్ నోటీసులు జారీ చేశారు. మోహన్ బాబు ఏమంటారు? చిరంజీవి సమాధానం ఏం చెబుతారు? అన్న దానిపై ఆసక్తి నెలకొంది.
Next Story