Sun Dec 22 2024 22:24:59 GMT+0000 (Coordinated Universal Time)
Hanuman : హనుమాన్ సినిమాలో ఆంజనేయుడిగా చిరంజీవి.. డైరెక్టర్ కామెంట్స్
హనుమాన్ సినిమాలో ఆంజనేయుడిగా చిరంజీవి కనిపించబోతున్నారా..? దర్శకుడు ప్రశాంత్ వర్మ ఏమన్నారంటే..?
Hanuman : టాలీవుడ్ లో తెరకెక్కుతున్న పాన్ వరల్డ్ మూవీ 'హనుమాన్'. ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో తేజ సజ్జ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం సూపర్ హీరో కాన్సెప్ట్ తో రూపొందింది. శ్రీరామ భక్తుడు హనుమంతుడి పవర్స్ ద్వారా ఒక సూపర్ హీరో పుట్టుకొస్తే.. అతడి కథ ఎలా ఉండబోతుందో ప్రశాంత్ వర్మ చూపించబోతున్నారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, టీజర్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా గ్రాఫిక్స్ అయితే వావ్ అనిపించాయి.
ట్రైలర్, టీజర్ లో హనుమంతుడిని జస్ట్ ఒక షాట్ లో కనురెప్ప గ్యాప్ లో చూపించి గూస్బంప్స్ తెప్పించారు. కాగా ఆ హనుమంతుడి పాత్రని గ్రాఫిక్స్ లో చూపిస్తున్నట్లు ట్రైలర్, టీజర్ చూసి అందరూ తెలుసుకున్నారు. అయితే గ్రాఫిక్స్ లో ఆ పాత్రని డిజైన్ చేయడానికి ఎవరి రూపు రేఖలని ఉపయోగించారో తెలుసా..? ఇంకెవరు ఆ హనుమంతుడి పేరుతో టాలీవుడ్ శిఖర స్థాయిని అందుకున్న చిరంజీవి.
ప్రస్తుతం హనుమాన్ ప్రమోషన్స్ లో ఉన్న దర్శకుడు ప్రశాంత్ వర్మ రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని బయట పెట్టారు. 'ట్రైలర్ లో చూపించిన హనుమంతుడి కళ్ళు.. చిరంజీవి గారిలా కనిపించాయి. ఏమైనా సర్ప్రైజ్ ఉందా..?' అని ప్రశ్నించగా, ప్రశాంత్ వర్మ బదులిస్తూ.. "ట్రైలర్ మీరు చూసిన కళ్ళు చిరంజీవి గారివే. హనుమంతుడి పాత్రని ఎలా చూపించాలో అని రెండేళ్లు చర్చికున్నాము. ఫైనల్ గా ఒకటి అనుకోని చేశాము. థియేటర్ లో అది మీరు చూసినప్పుడు తప్పకుండా థ్రిల్ ఫీల్ అవుతారు" అని చెప్పుకొచ్చారు. ఈ మాటలతో మూవీలో హనుమంతుడి పాత్ర చిరంజీవి పోలికలతో ఉండబోతుందని అర్ధమవుతుంది.
Next Story