Thu Dec 26 2024 16:28:58 GMT+0000 (Coordinated Universal Time)
రజినీకాంత్‌ని విమర్శించిన చిరంజీవి..
తాజాగా ఒక ప్రెస్ మీట్ లో చిరంజీవి చేసిన కామెంట్స్.. పరోక్షంగా రజినీకాంత్ ని విమర్శించినట్లు ఉన్నాయని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజినీకాంత్ సౌత్ ఇండస్ట్రీలో లెజెండ్స్ అన్న విషయం అందరికి తెలిసిందే. తమ తమ స్టైల్ ఆఫ్ యాక్టింగ్ తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఆరు పదుల వయసులో కూడా ఇండస్ట్రీ రికార్డులు క్రియేట్ చేస్తూ.. తాము ఇంకా నెంబర్ వన్ స్టార్స్ అనిపించుకుంటున్నారు. ఇక ఈ ఇద్దరు మంచి మిత్రులు కూడా. అయితే తాజాగా ఒక ప్రెస్ మీట్ లో చిరంజీవి చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.
చిరంజీవి మాట్లాడుతూ.. "ఇంత వయసులో కూడా డాన్స్, ఫైట్స్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. మన సింపుల్ గా అలా నడుచుకుంటూ వస్తుంటే.. వెనకాల బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మన హీరోయిజమ్‌ని ఎలివేట్ చేస్తే చాలు అనిపిస్తుంది. కానీ నేను అలాంటి నటుడిని కాదు. నేను డాన్స్ లు వేయాలి, ఫైట్స్ చేయాలి. అదే అభిమానులకు నచుతుంది, నాకు నచుతుంది" అంటూ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి.
ఇటీవల రజినీకాంత్ నటించిన 'జైలర్' సినిమాని అందరూ చూసే ఉంటారు. ఆ సినిమాలో రజిని పెద్దగా ఫైట్ చేసిన సీన్స్ ఏమి లేవు. హీరోయిజమ్ మొత్తం బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ తో అలా ఎలివేట్ చేశారు. ఈ విషయాన్ని రజినీకాంత్ కూడా జైలర్ సక్సెస్ మీట్ లో చెప్పుకొచ్చాడు. ఇక జైలర్ రిలీజ్ సమయంలోనే చిరంజీవి భోళాశంకర్ కూడా రిలీజ్ అయ్యింది. ఆ సమయంలో ఈ రెండు సినిమాలను పోలుస్తూ.. చిరంజీవిని విపరీతంగా విమర్శించారు.
ఏజ్ కి తగ్గట్టు సినిమాలు చేయడం లేదని చిరంజీవిని విమర్శిస్తూ కామెంట్స్ చేశారు. ఇక ఇప్పుడు చిరంజీవి చేసిన కామెంట్స్.. పరోక్షంగా రజినీకాంత్ ని విమర్శించినట్లు ఉన్నాయని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి చిరంజీవి ఈ కామెంట్స్ ఏ ఉద్దేశంతో చేసాడో తెలియదుగాని.. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో మాత్రం నెట్టింట వైరల్ గా మారింది.
Next Story