చిరు కన్ఫ్యూజన్ ఏమిటి?
చిరంజీవి పుట్టిన రోజునాడు కొత్త సినిమా ఎనౌన్సమెంట్ అంటూ ప్రచారం జరిగినా చిరు మాత్రం కొత్త సినిమాని ప్రకటించలేదు. అయితే చిరు ఆచార్య తర్వాత లూసిఫెర్ రీమేక్ [more]
చిరంజీవి పుట్టిన రోజునాడు కొత్త సినిమా ఎనౌన్సమెంట్ అంటూ ప్రచారం జరిగినా చిరు మాత్రం కొత్త సినిమాని ప్రకటించలేదు. అయితే చిరు ఆచార్య తర్వాత లూసిఫెర్ రీమేక్ [more]
చిరంజీవి పుట్టిన రోజునాడు కొత్త సినిమా ఎనౌన్సమెంట్ అంటూ ప్రచారం జరిగినా చిరు మాత్రం కొత్త సినిమాని ప్రకటించలేదు. అయితే చిరు ఆచార్య తర్వాత లూసిఫెర్ రీమేక్ చేయబోతున్నాడని, సాహో డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో లూసిఫెర్ తెలుగు స్క్రిప్ట్ రెడీ అన్నారు. అంతలోనే చిరు లూసిఫెర్ వదిలేస్తున్నాడని, సుజిత్ చెప్పిన తెలుగు స్క్రిప్ట్ చిరుకి నచ్చలేదని, మధ్యలో దర్శకుడు మారుతున్నాడనే టాక్ కూడా నడిచింది.ఈలోపు ప్లాప్ దర్శకులతో చిరు సినిమాలన్నారు. బాబీ ఒక కథ రెడీ చేసుకున్నాడని, చిరు ఓకె చెప్పాడన్నారు. అలాగే మెహెర్ రమేష్ తో వేదలమ్ రీమేక్ అన్నారు. చిరు పుట్టిన రోజునాడు బాబీ సినిమా అయినా, లేదా వేదాళం రీమేక్ మెహెర్ తో అయినా ప్రకటించేస్తున్నారనుకున్నారు.
కానీ ఎలాంటి చడీ చప్పుడు లేదు. కానీ తాజాగా చిరు ఆచార్య తర్వాత లూసిఫెర్ చేసే ఆలోచనలోనే ఉన్నాడట. అందుకే మెహెర్ రమేష్, బాబీ సినిమాలను హోల్డ్ లో పెట్టాడట. త్రివిక్రమ్ తో సినిమా కూడా లూసిఫెర్ రీమేక్ తర్వాతే అని చిరు ఆలోచనలో ఉన్నాడనే టాక్ వినిపిస్తుంది. అయితే చిరు ఆచార్య తరవాత ఎలాంటి సినిమా చెయ్యాలో తెలియక కన్ఫ్యూజన్ కి గురవుతున్నాడని, అందుకే ఎలాంటి ప్రాజెక్ట్ ని ప్రకటించడం లేదని అంటున్నారు. కాని ఆచార్య తరవాత చిరు లూసిఫెర్ రీమేక్ చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయట.