Fri Dec 20 2024 14:24:55 GMT+0000 (Coordinated Universal Time)
కార్తీ సినిమాకి చిరు అడ్డుపడుతున్నాడా..?
తమిళ్ హీరో కార్తీ సర్దార్ 2 సినిమాకి చిరు అడ్డుపడుతున్నాడా..? ఆ దర్శకుడి దగ్గరకి టాలీవుడ్ రైటర్స్ ని పంపించి..
మెగాస్టార్ చిరంజీవి ఈ ఏడాది 'వాల్తేరు వీరయ్య'తో బ్లాక్ బస్టర్ హిట్టుని, 'భోళాశంకర్'తో డిజాస్టర్ ని అందుకున్నాడు. భోళాశంకర్ విషయంలో అనేక విమర్శలు కూడా ఎదుర్కొన్నాడు. దీంతో చిరు తన రూట్ ని మార్చేశాడు. ప్రయోగాలు వైపు, తన ఏజ్ కి తగ్గ కథలు వైపు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది. ఈక్రమంలోనే 'బింబిసారా' దర్శకుడు వశిష్టతో Mega156 సినిమాని సోషియో ఫాంటసీ డ్రామా నేపథ్యంలో చేయబోతున్నాడు.
ఇక ఈ మూవీ తరువాత ఒక తమిళ దర్శకుడితో చిరు 157 సినిమా చేసేందుకు సిద్దమవుతున్నాడట. గత ఏడాది తమిళ హీరో కార్తీతో 'సర్దార్' వంటి యాక్షన్ థ్రిల్లర్ మూవీ తెరకెక్కించి బ్లాక్ బస్టర్ హిట్టు అందుకున్న దర్శకుడు 'పీఎస్ మిత్రన్'. ఇప్పుడు ఈ డైరెక్టర్ తోనే చిరు ఒక సినిమా చేయాలని అనుకుంటున్నాడట. అయితే ఈ దర్శకుడు ఆల్రెడీ కార్తితో 'సర్దార్ 2' సినిమాని ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి.
గత కొన్నిరోజులు క్రితం కార్తీ కూడా.. సర్దార్ 2 త్వరలో స్టార్ట్ కానుందని ట్వీట్ చేశాడు. అయితే దర్శకుడు పీఎస్ మిత్రన్ ఇప్పుడు చిరు సినిమా స్క్రిప్ట్ పై పని చేయడానికి సిద్ధమయ్యాడని టాక్ వినిపిస్తుంది. చిరు కొందరు టాలీవుడ్ రైటర్స్ ని మిత్రన్ దగ్గరకి పంపించి.. ఆ స్క్రిప్ట్ కంప్లీట్ చేయించేలా పనులు మొదలుపెట్టాడట. దీంతో సర్దార్ 2 సినిమాకి చిరు అడ్డుపడుతున్నాడా..? అనే సందేహం మొదలవుతుంది. ఇంతకీ అసలు విషయం ఏంటి..?
పీఎస్ మిత్రన్, చిరుకి ఏడాది క్రితమే ఒక స్టోరీ లైన్ వినిపించాడట. చిరంజీవికి కూడా అది బాగా నచ్చింది. అయితే ఫస్ట్ హాఫ్ మొత్తం ఒకే గాని సెకండ్ హాఫ్ పై కొంచెం వర్క్ చేయాల్సి ఉంది. అలాగే ఈ మూవీని తెలుగు, తమిళంలో బై లింగువల్ గా తెరకెక్కించబోతున్నారు. దీంతో రెండు బాధలో నేటివిటీకి తగ్గట్టు రెండు స్క్రీన్ ప్లేలు రెడీ చేస్తున్నారట. ఈక్రమంలోనే తెలుగు వెర్షన్ కోసం టాలీవుడ్ రైటర్స్ ని చిరు పంపించాడని సమాచారం. మరి ఈ స్క్రిప్ట్ పూర్తి చేసి సర్దార్ 2 కంటే ముందే ఈ మూవీని మొదలుపెడతారా..? లేదా స్క్రిప్ట్ దశలోనే ఆగిపోతుందా..? అనేది చూడాలి.
Next Story