Mon Dec 23 2024 03:36:05 GMT+0000 (Coordinated Universal Time)
మీడియా పై ఫైర్ అయిన చిరంజీవి
సినిమా రిలీజ్ కి ముందు గాడ్ ఫాదర్ సినిమాపై ఇష్టమొచ్చినట్లు వార్తలు రాయడంపై చిరంజీవి అసహనం వ్యక్తం చేశారు.
మోహన్ రాజా దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటించిన గాడ్ ఫాదర్ సినిమా భారీ విజయం సాధించింది. సినిమా విడుదలై ఐదురోజులవ్వగా.. థియేటర్లు ప్రతి షో కి హౌస్ ఫుల్ అవుతున్నాయి. ఈ సినిమాలో చిరంజీవి నటనను చూసినవారంతా బాస్ ఈజ్ బ్యాక్ అంటున్నారు. తాజాగా ఈ చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ను నిర్వహించగా.. ఆ ఈవెంట్లో అందరూ చిరంజీవిపై ప్రశంసలు కురిపించారు. ఈ నేపథ్యంలో చిరంజీవి మీడియాపై ఫైర్ అయ్యారు.
సినిమా రిలీజ్ కి ముందు గాడ్ ఫాదర్ సినిమాపై ఇష్టమొచ్చినట్లు వార్తలు రాయడంపై చిరంజీవి అసహనం వ్యక్తం చేశారు. "సినిమా షూట్ లేట్ అయిందని, సినిమా బాగోలేదు అని, ప్రమోషన్స్ మొదలు పెట్టలేదని, సినిమాలో ఏం లేదు అని, రీమేక్ సినిమా అంత హైప్ లేదని రాశారు. మాకు ఆ వార్తలు చాలా ఇబ్బంది, చిరాకు కలిగించాయి. మా సినిమాని ఎప్పుడు ఎలా ప్రమోట్ చేయాలో మాకు తెలీదా. మీడియా ఎందుకు డిస్ట్రబెన్స్ చేస్తుంది అని ఆలోచించాము. డైరెక్టర్, నేను, నిర్మాత దీనిపై మాట్లాడుకున్నాము. అసలే సినిమా లేట్ అవుతుందని మేము కంగారు పడుతుంటే మధ్యలో మళ్ళీ దీని గురించి ఆలోచించాము". ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తాను వర్షంలో మాట్లాడటానికి కూడా మీడియానే అన్నారు.
వర్షం పడటంతో ఈవెంట్ లో రసాభాస జరిగింది.. తొక్కిసలాట జరిగిందని రాయకుండా ఉండాలనే.. వర్షంలో మాట్లాడానని చెప్పుకొచ్చారు. అదే మీడియా సినిమా విడుదలయ్యాక సినిమా బాగుందని మంచి వార్తలు రాసిందని పొగిడారు. అప్పుడే మీడియా పై సీరియస్ అయి.. వెంటనే థ్యాంక్స్ చెప్తూ మాట్లాడారు చిరంజీవి.
Next Story