మీరు ఎంత స్మార్ట్ బాస్
చిరంజీవి మెగాస్టార్ మాములుగా అవ్వలేదు. ఆయనలోని నటన, డాన్స్, కామెడీ, యాక్షన్ అన్ని కలిపి ఆయనని మెగాస్టార్ ని చేసాయి. ఒకప్పుడు చిరు తో సినిమా అనగానే [more]
చిరంజీవి మెగాస్టార్ మాములుగా అవ్వలేదు. ఆయనలోని నటన, డాన్స్, కామెడీ, యాక్షన్ అన్ని కలిపి ఆయనని మెగాస్టార్ ని చేసాయి. ఒకప్పుడు చిరు తో సినిమా అనగానే [more]
చిరంజీవి మెగాస్టార్ మాములుగా అవ్వలేదు. ఆయనలోని నటన, డాన్స్, కామెడీ, యాక్షన్ అన్ని కలిపి ఆయనని మెగాస్టార్ ని చేసాయి. ఒకప్పుడు చిరు తో సినిమా అనగానే హీరోయిన్స్ మెలికలు తిరిగేవారు. కానీ ఇప్పుడు చిరు అమ్మాయిలని చూడగానే మెలికలు తిరుగుతున్నాడు. చిరు కు వయసైపోతున్నా ఆయనలో రొమాంటిక్ యాంగిల్ ఏం తగ్గలేదు. నిన్నటికి నిన్న బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే స్టేజ్ మీద హీరోయిన్ దివి, హరికలతో చిరు రొమాంటిక్ గా మాట్లాడి అందరిని పడేసారు. ఈ వయసులోనూ చిరు చాలా స్మార్ట్ గా బరువు తగ్గి ఆయన కొడుకు రామ్ చరణ్ కే పోటీ ఇచ్చేస్తున్నాడు. అలాగే అమ్మాయిలని చూడగానే రొమాంటిక్ గా మెలికలు తిరగడం చూసిన వారు.. మీరు చాలా రొమాంటిక్ బోస్ అంటున్నారు.
అలాగే సమంత హోస్ట్ చేస్తున్న సామ్ జామ్ ప్రోమో లోను చిరు సిగ్గుపడడం చూస్తే అబ్బా ఈ వయసులోనూ బాస్ గ్రెస్ తగ్గలేదు అంటారు. సమంత అడిగే చిలిపి ప్రశ్నలకు చిరు సిగ్గుపడుతూ ఇచ్చే సమాధానాల ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మీ ఫ్రిజ్ లో ఎల్లప్పుడు ఉండే వస్తువు అని సామ్ అడగగానే మీరన్నది కాదు అన్న చిరు.. మీరు సినిమా చూస్తూ ఎపుడైనా ఏడ్చేసారా అని సామ్ అనగానే.. ఓ సినిమా చూసినప్పుడు నా కళ్ళలో నీళ్లు కారిపోతున్నాయి.. పక్కనే ఉన్న చీర చెంగు తీసుకుని తుడుచుకుంటున్న సమయంలో లైట్స్ వేశారు అంటూ చిరు అనేసరికి సమంత కూడా ఫన్నీగా మీరు చాలా రొమాంటిక్ అనుకున్నారేమో అనగానే చిరు పడిన సిగ్గు అంతా ఇంతా కాదు. వయసైపోతున్న చిరులో రొమాంటిక్ యాంగిల్ ఏమాత్రం తగ్గలేదు బాస్ అంటున్నారు నెటిజెన్స్.