మెగా ఫ్యాన్స్ కి షాకిచ్చిన కొరటాల?
భరత్ అనే నేను సినిమా తర్వాత చిరంజీవి సినిమా కోసం స్క్రిప్ట్ వర్క్ చేస్తున్న కొరటాల శివ… ఈ సినిమాని అధికారికముగా ప్రకటించడం.. సినిమా మొదలు పెట్టడం [more]
భరత్ అనే నేను సినిమా తర్వాత చిరంజీవి సినిమా కోసం స్క్రిప్ట్ వర్క్ చేస్తున్న కొరటాల శివ… ఈ సినిమాని అధికారికముగా ప్రకటించడం.. సినిమా మొదలు పెట్టడం [more]
భరత్ అనే నేను సినిమా తర్వాత చిరంజీవి సినిమా కోసం స్క్రిప్ట్ వర్క్ చేస్తున్న కొరటాల శివ… ఈ సినిమాని అధికారికముగా ప్రకటించడం.. సినిమా మొదలు పెట్టడం జరిగింది. కానీ చిరు సినిమాని కొరటాల ఎప్పుడు సెట్స్ మీదకి తీసుకెళ్తాడో అనే విషయం మాత్రం మెగా ఫ్యాన్స్ కి క్లారిటీ రావడం లేదు… సై రా అక్టోబర్ 2 న విడుదలవగా.. తెలుగు రాష్ట్రాల్లో హిట్ అయినా… మిగతా భాషల్లో సై రా ఘోరమైన ప్లాప్ అందుకుంది. ఇక ఆ సినిమా అయ్యాక చిరు, కొరటాల సినిమా కోసం నవంబర్ కే రేడి అవుతాడని అన్నారు. కాదు డిసెంబర్ అన్నారు.. మరి ఈ ఏడాది గడిచిపోయింది… ఇక జనవరిలో కొరటాల – చిరు సినిమాఅన్నారు కానీ… ఇప్పుడు అది మరింత లేటయ్యేలా కనబడుతుంది.
సై రా ఫలితంతో కొరటాల ఈసారి ఎలాంటి డ్యామేజ్ జరగకుండా ఉండేలా కట్టుదిట్టమైన ప్లాన్ చేసుకొంటున్నాడని, ఇక చిరు కూడా పూర్తిగా కొరటాల మూవీ కోసం రెడీ అవ్వలేదు కాబట్టి.. సినిమా మరింత లెట్ అవ్వొచ్చనే ఊహాగానాలు సోషల్ మీడియాలో బయలుదేరాయి. ప్రీ ప్రొడక్షన్ పనులు ఆలస్యం కావడంతో ఈ చిత్రాన్ని ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో మొదలు పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఇక చిరు మరింత బరువు తగ్గి యంగ్ లుక్ లో కనిపించాలంటే కాస్త సమయం పట్టేట్టుగా ఉందని… అందుకే సినిమా లేట్ అంటున్నారు. మరి ఈ సినిమా మొత్తం దేవాలయ ఆస్తులను కాపాడడానికి హీరో ఏం చేసాడు. ప్రభుత్వానికి ఎలాంటి సందేశం ఇచ్చాడనే కాన్సప్ట్ తో ఈ సినిమా తెరకెక్కబోతుంది. ఇక ఈ సినిమాలో త్రిష మరోసారి చిరు తో కలిసి నటించనుంది