Mon Dec 23 2024 16:13:51 GMT+0000 (Coordinated Universal Time)
Chiru - Mahesh: 'జై హనుమాన్'లో రాముడిగా మహేష్.. హనుమాన్గా చిరంజీవి..
'జై హనుమాన్'లో చిరంజీవి హనుమంతుడిగా, మహేష్ రాముడిగా కనిపించబోతున్నారా..? ప్రశాంత్ వర్మ రీసెంట్ ఇంటర్వ్యూలో ఏమన్నారు..?
Chiranjeevi - Mahesh Babu : చిరంజీవి, మహేష్ బాబు.. హనుమాన్ సీక్వెల్ 'జై హనుమాన్'లో నటించబోతున్నారా..? ఆ సినిమాలో చిరంజీవి హనుమంతుడిగా, మహేష్ రాముడిగా కనిపించబోతున్నారా..? దర్శకుడు ప్రశాంత్ వర్మ రీసెంట్ ఇంటర్వ్యూలో ఏమన్నారు..?
ప్రశాంత్ వర్మ సూపర్ హీరో సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'హనుమాన్' సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. అంతేకాదు ఈ సినిమా చివరిలో రెండో పార్టుకి లీడ్ ఇస్తూ.. ఇచ్చిన ఎండింగ్ అందరికి గూస్బంప్స్ తెప్పించింది. దీంతో ప్రేక్షకులంతా సీక్వెల్ పై భారీ అంచనాలతో ఉన్నారు. కాగా 'జై హనుమాన్' మూవీ ఆంజనేయస్వామి ప్రధాన పాత్రగా సాగుతుందని, ఆ సినిమాలో స్టార్ హీరో హనుమాన్ గా కనిపిస్తాడని దర్శకుడు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలియజేశారు.
ఈక్రమంలోనే చిరంజీవి, రానా దగ్గుబాటి పేర్లు వినిపించాయి. మూవీలో హనుమాన్ కళ్ళు చిరంజీవిలా ఉన్నాయని, చిరునే ఆ పాత్ర పోషిస్తున్నాడని అందరూ అభిప్రాయపడుతూ వస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో దీని గురించి ప్రశాంత్ వర్మని ప్రశ్నించగా, ఆయన బదులిస్తూ.. "చిరంజీవి గారు హనుమాన్ పాత్రలో చేసే అవకాశం ఉంది" అంటూ చెప్పుకొచ్చారు.
అలాగే 'జై హనుమాన్'లో రాముడి పాత్ర కూడా కనిపించనుంది. దీంతో ఆ పాత్రని మహేష్ బాబుతో చేయించాలని ప్రశాంత్ వర్మ అండ్ టీం.. మహేష్ ని రాముడిగా స్కెచ్ కూడా వేయించి చూశారట. ఒకవేళ అంతా సెట్ అయితే.. చిరంజీవి హనుమంతుడిగా, మహేష్ బాబు రాముడిగా కనిపించే అవకాశం ఉందని ప్రశాంత్ వర్మ పేర్కొన్నారు. ఈ కాంబినేషన్ పై అభిమానులు కూడా క్యూరియాసిటీతో ఉన్నారు. మరి ఇది సెట్ అవుతుందో లేదో చూడాలి.
Next Story