Thu Dec 26 2024 16:54:43 GMT+0000 (Coordinated Universal Time)
Mega157 అప్డేట్ ఇచ్చిన దర్శకుడు వశిష్ట.. అంజి చిత్రానికి..
దర్శకుడు వశిష్ట, చిరంజీవి Mega157 గురించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు. ఈ మూవీ కోసం అంజి చిత్రానికి..
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఈ ఏడాదిని 'వాల్తేరు వీరయ్య' వంటి బ్లాక్ బస్టర్ తో స్టార్ట్ చేసినప్పటికీ.. ఆగష్టులో 'భోళా శంకర్' సినిమాతో భారీ డిజాస్టర్ ని అందుకొని అభిమానులను నిరాశపరిచాడు. ఈ సినిమాతో అనేక విమర్శలు కూడా చిరంజీవి ఎదురుకున్నాడు. ఇక వాటన్నిటికీ చిరంజీవి మరో బ్లాక్ బస్టర్ తో గట్టి సమాధానం ఇవ్వాలంటూ మెగా ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఈక్రమంలోనే ‘బింబిసార’ డైరెక్టర్ వశిష్టతో క్రేజీ ప్రాజెక్ట్ ని ప్రకటించాడు.
ఈ మూవీని అనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసిన కాన్సెప్ట్ పోస్టర్ కూడా అందర్నీ ఆకట్టుకుంది. పంచభూతాలు నేపథ్యంతో సోషియో ఫాంటసీ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కబోతుందని పోస్టర్ చూస్తే అర్థమైంది. చిరంజీవి గతంలో 'అంజి' సినిమాతో ఇటువంటి జోనర్ ని టచ్ చేశాడు. దీంతో ఆడియన్స్ లో ఈ మూవీ పై మరింత ఆసక్తి పెరిగింది. ఇక ఈ మూవీ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుంది, ఎప్పుడు థియేటర్స్ లోకి వస్తుందని అభిమానులు ఎదురు చూస్తున్నారు.
తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఒక అప్డేట్ ని వశిష్ట అభిమానులకు తెలియజేశాడు. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ మొదలైందని, త్వరలోనే సినిమాటిక్ అడ్వెంచర్ కూడా మొదలవుతుందని ట్వీట్ చేశాడు. అలాగే ఒక ఫోటోని కూడా షేర్ చేశాడు. ఆ పిక్ లో దర్శకనిర్మాతలు, చిరుతో పాటు సినిమాటోగ్రాఫర్ చోటా కె నాయుడు కూడా ఉన్నాడు. దీంతో ఈ సినిమాకి డిఒపిగా చోటా కె నాయుడు వర్క్ చేయబోతున్నట్లు తెలుస్తుంది.
కాగా చిరంజీవి అంజి సినిమాకి కూడా చోటా కె నాయుడే సినిమాటోగ్రాఫర్ గా పని చేశాడు. ఆ సినిమాలోని విజువల్స్ ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ లోకి చోటా ఎంట్రీ ఇవ్వడం మరో ఆకర్షణగా నిలిచింది. ఇక ఈ చిత్రంలో నటించే నటీనటులు, ఇతర టెక్నీషియన్స్ వివరాలు కూడా త్వరలో తెలియనున్నాయి. యూవీ క్రియేషన్స్ ఈ సినిమాని నిర్మిస్తుంది.
Next Story