Mon Dec 23 2024 02:26:25 GMT+0000 (Coordinated Universal Time)
మనవడి పెళ్ళికి నాయనమ్మ అంజనా దేవి వెళ్లడం లేదా..?
వరుణ్ తేజ్ పెళ్ళికి నాయనమ్మ అంజనా దేవి హాజరుకాలేక పోతున్నారట. ఆమె వెళ్లకపోవడానికి గల కారణం ఏంటి..?
ఈ బుధవారం (నవంబర్ 1) మెగా ఇంట పెళ్లి భజంత్రీలు మోగబోతున్నాయి. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, డింపుల్ భామ లావణ్య త్రిపాఠి ఏడడుగులు వేసి తమ ప్రేమ జీవితాన్ని పెళ్లి బంధంతో ముందుకు తీసుకు వెళ్ళబోతున్నారు. ఇక ఈ పెళ్లి వేడుక ఇటలీలోని టుస్కానీ నగరంలో జరగబోతున్న సంగతి తెలిసిందే. నేటి (అక్టోబర్ 30) నుంచి మొదలు కాబోతున్న ఈ పెళ్లి వేడుక.. సంగీత్ పార్టీ, హల్దీ, మెహందీ కార్యక్రమాలతో సందడిగా సాగుతూ నవంబర్ 1న పెళ్లితో ముగియనుంది.
ఇక ఈ పెళ్లి కోసం ఇప్పటికే మెగా కుటుంబం అంతా అక్కడికి చేరుకుంది. తమ్ముడు పెళ్లి పనులు కోసం రామ్ చరణ్ ఉపాసనతో కలిసి ముందుగానే ఇటలీ వెళ్లగా.. ఆ తరువాత నూతన వధూవరులు, చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ ఇలా అందరూ అక్కడికి చేరుకుంటున్నారు. అయితే ఈ పెళ్ళికి వరుణ్ తేజ్ నాయనమ్మ అంజనా దేవి హాజరుకాలేక పోతున్నారని సమాచారం. ఆమె వెళ్లకపోవడానికి గల కారణం ఏంటి..?
ఆరోగ్య సమస్య కారణంగా అంజనా దేవి ప్రయాణం చేయడం మంచిది కాదని డాక్టర్స్ సూచించారట. దీంతో ఆమె ఇంటిలోనే ఉండాల్సి వస్తుందట. అయితే ఆమె ఇంటి నుంచే పెళ్లి వేడుక మొత్తాన్ని ప్రత్యక్షంగా చూసేలా చిరంజీవి ప్రత్యేక ఏర్పాట్లు చేశాడని తెలుస్తుంది. ఇక ఈ పెళ్ళికి అంజనా దేవితో పాటు రేణూదేశాయ్ కూడా దూరంగా ఉంటుంది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రేణూదేశాయ్ ఈ విషయాన్ని తెలియజేసింది.
ఎనిమిదేళ్ల వయసు నుంచి వరుణ్ తన కళ్ళ ముందే పెరిగాడని, తన అశీసులు వరుణ్ కి ఎప్పుడూ ఉంటాయని, అయితే పెళ్ళికి మాత్రం వెళ్లడం లేదని తెలియజేసింది. తను వెళ్తే ఫ్యామిలీలోని వారంతా అన్‌కంఫర్టబుల్‌గా ఫిల్ అవుతారని, నిహారిక పెళ్లికి కూడా అందుకే వెళ్లలేదని ఆమె చెప్పుకొచ్చింది. నిహారిక పెళ్ళికి పిల్లల్ని (అకీరా నందన్, ఆద్య) పంపించిన రేణూదేశాయ్.. ఇప్పుడు ఇటలీలో పెళ్లి కావడంతో అక్కడికి పంపించడం లేదని పేర్కొంది.
Next Story