హ్యాండ్సమ్ మెగాస్టార్
మెగాస్టార్ చిరంజీవి ఏంటి ఇలా ఉన్నారు? ఇంత హ్యాండ్సమ్గా ఉన్నారంటే? అసలు ఆయన వయసు ఎంత? ఇంత ఫిట్ గా ఎలా ఉన్నారు? అంటూ సోషల్ మీడియాలో [more]
మెగాస్టార్ చిరంజీవి ఏంటి ఇలా ఉన్నారు? ఇంత హ్యాండ్సమ్గా ఉన్నారంటే? అసలు ఆయన వయసు ఎంత? ఇంత ఫిట్ గా ఎలా ఉన్నారు? అంటూ సోషల్ మీడియాలో [more]
మెగాస్టార్ చిరంజీవి ఏంటి ఇలా ఉన్నారు? ఇంత హ్యాండ్సమ్గా ఉన్నారంటే? అసలు ఆయన వయసు ఎంత? ఇంత ఫిట్ గా ఎలా ఉన్నారు? అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ తెగ వేస్తున్నారు. ఒకసారి ఈ ఫోటో చుస్తే మీకే అర్ధం అవుతుంది. ‘ఖైదీ నంబర్ 150’ సినిమాతోనే హ్యాండ్సమ్గా ఉన్న చిరు సైరా కోసం బరువు పెరగాల్సి వచ్చింది. కానీ కొరటాల సినిమా కోసం మళ్లీ బరువు తగ్గి నాజూగ్గా తయారయ్యే ప్రయత్నంలో ఉన్న సంగతి తెలిసిందే.
ఫొటో షూట్లో….
అయితే ఈ లుక్ ఎలా ఉంటుంది? చిరంజీవి ఇందులో ఎలా ఉండబోతున్నారు? అని అంత అనుకున్నారు. దానికి ట్రైలర్ వెర్షన్ గా ఈ లుక్ అని అర్ధం అవుతుంది. రీసెంట్ గా చిరు తన కోడలుతో కలిసి బి-పాజిటివ్ అనే మ్యాగజైన్ కోసం చేసిన ఫొటో షూట్లో చిరు మెస్మరైజింగ్ లుక్స్‌తో అభిమానుల్ని మురిపించాడు. మేకప్ వేస్తారు కాబట్టి చిరు ఇలా ఉన్నాడు అనుకుంటే మొన్న జరిగిన ఒక వేడుకకు హాజరైన సందర్భంగా కనిపించిన లుక్ చూసి అభిమానులు మరింత షాకవుతున్నారు.
వైరల్ అయి…..
స్వర సంగమం అనే సంగీత కార్యక్రమానికి చిరు ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ ప్రోగ్రామ్ కి ఎస్పీబాలు సహా అనేకమంది సంగీత దిగ్గజాలు పాల్గొనడం జరిగింది. చిరంజీవి చాలా క్యాజువల్‌గా అనిపించే ప్యాంట్, షర్టులో వచ్చిన చిరు.. లుక్స్ పరంగా ఈ మధ్య కాలంలో ది బెస్ట్ అన్నట్లుగా తయారయ్యాడు. ప్రసుతం చిరు కి సంబంధించిన ఆ ఫొటోస్ సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. ఇక మెగా ఫ్యాన్స్ అయితే సైరా కన్నా ముందు కొరటాల సినిమా ఎప్పుడూ వస్తుంది వెయిట్ చేస్తున్నారు.