Mon Dec 23 2024 15:28:29 GMT+0000 (Coordinated Universal Time)
వాల్తేరు వీరయ్య నుండి కొత్త పోస్టర్.. మాస్ పూనకాలే
ఇది కేవలం శాంపిల్ మాత్రమేనని, ఇందుకు సంబంధించిన ఎపిసోడ్ మొత్తం థియేటర్లలో పూనకాలు తెప్పించడం పక్కా..
టాలీవుడ్ యువదర్శకుడు బాబీ (కేఎస్ రవీంద్ర) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా వాల్తేరు వీరయ్య. ఇప్పటికే విడుదలైన టీజర్, బాస్ పార్టీ సాంగ్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. స్పెషల్లీ రవితేజ టీజర్ కు బాగా రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుండి మరో పోస్టర్ ను విడుదల చేశారు మేకర్స్. ప్యాంటు, చొక్కా వేసుకొని, కళ్ల జోడుతో పోలీస్ స్టేషన్ లో టేబుల్ పై చిరు స్టయిల్ గా కూర్చున్న పోస్టర్ ను ట్విట్టర్ లో షేర్ చేశారు. ఇందులో చిరు ముందు ఓ తుపాకీ, వెనకాల వరుసగా మరికొన్ని తుపాకులు ఉన్నాయి. హ్యాండ్ కప్స్ ను ఒక చేతిలో పట్టుకున్న చిరు స్టిల్ అదిరిపోయింది.
ఇది కేవలం శాంపిల్ మాత్రమేనని, ఇందుకు సంబంధించిన ఎపిసోడ్ మొత్తం థియేటర్లలో పూనకాలు తెప్పించడం పక్కా అని బాబీ పేర్కొన్నారు. కాగా.. ముఠామేస్త్రి తరహాలో చిరంజీవి పూర్తిస్థాయిలో మాస్ క్యారెక్టర్ లో కనిపించబోతున్న సినిమా కావడంతో.. భారీ అంచనాలే ఉన్నాయి. మైత్రీ మూవీమేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా శృతిహాసన్ నటించింది. 2023 జనవరి 13న సినిమా థియేటర్లలో విడుదల కానుంది. సంక్రాంతికి ప్రధానంగా మూడు సినిమాలు పోటీపడనున్నాయి. వాటిలో విజయ్ వారసుడు, బాలయ్య వీరసింహారెడ్డి, చిరు వాల్తేరు వీరయ్య సినిమాలున్నాయి. వారసుడు, వీరసింహారెడ్డి జనవరి 12న విడుదల కానున్నాయి.
Next Story