Mon Dec 23 2024 09:42:40 GMT+0000 (Coordinated Universal Time)
లీకైన మెగా 156 స్క్రిప్ట్ పేపర్.. టైటిల్ ఏంటో తెలుసా..?
మెగా 156 మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ పేపర్ ఒకటి నెట్టింట లీక్ అయ్యింది. ఆ పేపర్ లో సినిమా టైటిల్ ఏంటనేది తెలిసిపోయింది.
మెగాస్టార్ చిరంజీవి ఈ ఏడాది స్టార్టింగ్లో 'వాల్తేరు వీరయ్య'తో బ్లాక్ బస్టర్ ని అందుకొని బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ సునామీ చూపించి తన స్టామినా ఇంకా తగ్గలేదని తెలియజేశాడు. కానీ 'భోళాశంకర్'తో డిజాస్టర్ ని అందుకొని తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. దీంతో చిరంజీవి తన ప్లాన్ అఫ్ యాక్షన్ మార్చేశాడు. తన కూతురు సుస్మిత నిర్మాణంలో చేయాల్సిన సినిమా పక్కన పెట్టి.. బింబిసారా దర్శకుడు వశిష్ఠతో సినిమాకి కొబ్బరికాయ కొట్టాడు.
ఈ సినిమా సోషియో ఫాంటసీ కథతో ఆడియన్స్ ముందుకు రాబోతుందట. ఇక భోళాశంకర్ సినిమా విషయంలో ఎదుర్కొన విమర్శలను దృష్టిలో పెట్టుకొని.. ఈ మూవీలో తన ఏజ్ కి తగ్గ పాత్రని చిరంజీవి పోషిస్తున్నాడట. చిరు రోల్ చాలా పవర్ఫుల్ గా ఉంటుందంటూ దర్శకుడు చెబుతున్నారు. పూజా కార్యక్రమాలతో ఆల్రెడీ లాంచ్ అయిన ఈ మూవీ.. వరుణ్, లావణ్య పెళ్లితో హోల్డ్ లో ఉన్నట్లు తెలుస్తుంది.
పెళ్లి సందడి పూర్తి కాగానే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. ఈ గ్యాప్ లో దర్శకుడు స్క్రిప్ట్ అండ్ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ పై మరింత దృష్టి సరిస్తున్నాడట. ఇది ఇలా ఉంటే, తాజాగా ఈ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ పేపర్ ఒకటి నెట్టింట లీక్ అయ్యింది. ఆ పేపర్ లో సినిమా టైటిల్ ఏంటనేది తెలిసిపోయింది. ఈ మూవీకి 'విశ్వంభర' అనే హిస్టారికల్ టైటిల్ ని ఖరారు చేశారు. ప్రస్తుతం ఈ టైటిల్ నెట్టింట ట్రెండ్ అవుతుంది.
చిరంజీవి గతంలో అంజి, జగదేక వీరుడు అతిలోక సుందరి వంటి సోషియో ఫాంటసీ సినిమాల్లో నటించి ఆడియన్స్ ని అలరించాడు. ఆ చిత్రాలకు ఇప్పటి జనరేషన్ వాళ్లలో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. అలాంటి సబ్జెట్ తో చిరు మరోసారి వస్తున్నాడు అంటే అభిమానుల్లో మరింత క్యూరియాసిటీ నెలకుంది. ఈ సినిమాలో విలన్ గా రానా నటించబోతున్నాడని సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ చిత్రంలో ఎవరెవరు భాగం కాబోతున్నారో చూడాలి.
Next Story