Mon Dec 23 2024 08:39:51 GMT+0000 (Coordinated Universal Time)
Telangana Elections : చిరు టైమింగ్.. ఎన్టీఆర్ షాక్.. బ్రహ్మి రాక్స్..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయడానికి వచ్చిన చిరంజీవి, ఎన్టీఆర్, బ్రహ్మి పోలింగ్ బూత్ వద్ద తమ కామెడీ టైమింగ్ ని ప్రదర్శించారు.
Election Day : నేడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ డే అన్నది అందరికి తెలిసిందే. ఇక ఒక పౌరుడిగా తమ ఓటు హక్కుని ఉపయోగించుకునేందుకు ప్రతి ఒక్కరు పోలింగ్ బూత్ దగ్గరకి చేరుకుంటున్నారు. టాలీవుడ్ సెలబ్రిటీస్ కూడా పోలింగ్ బూత్స్ వద్దకి వచ్చి, సాధారణ ప్రజలతో పాటు క్యూ లైన్లో నిలబడి వెళ్లి తమ ఓటు హక్కుని వినియోగించుకుంటున్నారు. ఇక ఈక్రమంలోనే తమ ఓటుని వేయడానికి వచ్చిన చిరంజీవి, ఎన్టీఆర్, బ్రహ్మానందం సంబంధించిన ఫన్నీ మూమెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
తన ఓటు వేసేందుకు లైన్ లో వేచి ఉన్న చిరంజీవి దగ్గరకు ఒక మీడియా రిపోర్టర్ వచ్చి ఎలక్షన్స్ గురించి మెగాస్టార్ కామెంట్స్ అడిగాడు. అతను అడిగిన ప్రశ్నకు చిరు.. "నేను మౌనవ్రతంలో ఉన్నా" అనే మాటని తానే స్వయంగా చెబుతూ పోలింగ్ బూత్ దగ్గర కూడా తన కామెడీ టైమింగ్ని ప్రదర్శించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
ఇక అలాగే లైన్ లో నిలబడిన ఎన్టీఆర్ ని మీడియా రిపోర్టర్స్ అంతా వీడియోలు తీస్తుంటే, ఎన్టీఆర్ వారితో మాట్లాడుతూ.. "మీరంతా ఇక్కడే ఉంటారా..? ఇంక ఓటు వేయరా మీరు..?" అని ప్రశ్నించారు. దానికి ఒక రిపోర్టర్ బదులిస్తూ.. "మీరు వేశాక మేము వేస్తాము" అంటూ చెప్పుకొచ్చారు. ఇంతలో మరో వ్యక్తి ఎన్టీఆర్ కి బదులిస్తూ.. "అందరూ వెయ్యరు. సగం మందే వేస్తాము" అంటూ చెప్పుకొచ్చాడు. ఆ మాటలకి ఎన్టీఆర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
చివరిగా బ్రహ్మానందం విషయాకి వస్తే.. ఓటు వేసి వస్తున్న బ్రహ్మీని మీడియా ప్రతినిథులు ప్రశ్నిస్తూ వచ్చారు. ఇంతలో ఒక రిపోర్టర్.. "ఓటు హక్కు ఉపయోగించుకొని వారిని మీరేమంటారు..?" అని ప్రశ్నించారు. దానికి హాస్యబ్రహ్మ బదులిస్తూ.. "ఏం అంటామండి, ఓటు హక్కు ఉపయోగించుకోలేని వారు" అని అంటాము అనే రాకింగ్ ఆన్సర్ ఇచ్చి నవ్వించారు.
Next Story