Sun Dec 22 2024 21:10:36 GMT+0000 (Coordinated Universal Time)
Jai HanuMan : 'జై హనుమాన్'లో హీరో చిరు..? రానా..?
'జై హనుమాన్' సినిమాలో హనుమంతుడిగా ఎవరు కనిపించబోతున్నారు. చిరంజీవి..? రానా దగ్గుబాటి..?
Jai HanuMan : ప్రశాంత్ వర్మ సూపర్ హీరో సినిమాటిక్ యూనివర్స్ నుంచి ఆడియన్స్ ముందుకు వచ్చిన 'హనుమాన్' సినిమా ఎంతటి విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాక్స్ ఆఫీస్ చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి ప్రపంచవ్యాప్తంగా 200 కోట్లకు పైగా కలెక్షన్స్ నమోదు చేసి ఈ ఏడాది మొదటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇది ఇలా ఉంటే, ఈ సినిమా చివరిలో సీక్వెల్ కి కనెక్షన్ ఇస్తూ.. భారీ హైప్ ని క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే.
దీంతో ప్రేక్షకులంతా సెకండ్ పార్ట్ 'జై హనుమాన్' కోసం ఎంతో క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నారు. లార్డ్ హనుమాన్ సూపర్ హీరోగా సాగే ఆ సినిమాలో హనుమంతుడిగా ఎవరు కనిపించబోతున్నారు అని అందరిలో ఆసక్తి నెలకుంది. హనుమాన్ మూవీలో ఆంజనేయస్వామి పేస్ ని పూర్తిగా రివీల్ చేయలేదు. ఆ పాత్రలో టాలీవుడ్ లోని ఓ స్టార్ హీరో కనిపించబోతున్నారట. ఆ స్టార్ హీరో ఎవరు అనే ప్రశ్నకు ప్రశాంత్ వర్మ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.
కాగా హనుమాన్ సినిమా చూసిన వారు.. మూవీలోని హనుమాన్ కళ్ళు మెగాస్టార్ చిరంజీవి కళ్ళలా కనిపించాయని అంటున్నారు. మరికొంతమందేమో సైడ్ పేస్ కట్ రానా దగ్గుబాటిలా అనిపించిందని కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ కామెంట్స్ చూసిన మిగిలిన ఆడియన్స్.. ఈ ఇద్దరిలో ఎవరు ఆ పాత్ర చేసిన సూపర్ ఉంటుందని పేర్కొంటున్నారు. మరి ప్రశాంత్ వర్మ ఆ పాత్రకి ఏ స్టార్ హీరోని ఎంపిక చేసుకుంటాడో చూడాలి.
ఇక ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ని కూడా ప్రశాంత్ వర్మ మొదలుపెట్టేశారు. 2025కి ఈ సినిమా తీసుకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ సీక్వెల్ లో తేజ సజ్జ.. 'హనుమంతు' పాత్రతో ఆంజనేయస్వామి సైనికుడిగా కనిపించబోతున్నాడట. 'హనుమాన్ రాముడికి ఇచ్చిన మాట ఏంటి' అనే ఒక సస్పెన్స్ మొదటి పార్ట్ ని ఎండ్ చేసి సెకండ్ పార్ట్ పై భారీ హైప్ ని క్రియేట్ చేసిన ప్రశాంత్ వర్మ.. జై హనుమాన్ ఎలా సిద్ధం చేస్తారో చూడాలి.
Next Story