Sat Dec 28 2024 05:37:22 GMT+0000 (Coordinated Universal Time)
ఓటీటీ రిలీజ్ ఫిక్స్ చేసుకున్న భోళా శంకర్.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడ?
చిరంజీవి నటించిన రీసెంట్ మూవీ 'భోళా శంకర్' ఓటీటీలోకి వచ్చేందుకు డేట్ ఫిక్స్ చేసుకుంది.
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నటించిన రీసెంట్ మూవీ 'భోళా శంకర్' బాక్స్ ఆఫీస్ వద్ద రిలీజ్ అయ్యి భారీ పరాజయాన్ని అందుకుంది. మెహర్ రమేష్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం.. తమిళ్ హిట్ మూవీ 'వేదాళం'కి రీమేక్ గా తెరకెక్కింది. AK ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై తెరకెక్కిన ఈ చిత్రంలో కీర్తి సురేష్, తమన్నా, సుశాంత్.. తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. సిస్టర్ సెంటిమెంట్ అండ్ గ్యాంగ్ స్టార్ నేపథ్యంతో ఈ చిత్రం ఆగస్టు 11న ఆడియన్స్ ముందుకు వచ్చింది.
అయితే ఈ రీమేక్ పై అభిమానుల్లో ముందు నుంచి పెద్ద ఆసక్తి లేదు. ఇక థియేటర్ లో కూడా ఈ చిత్రం ఏ మాత్రం అలరించే విధంగా లేకపోవడంతో ఈ ఇయర్ లో మరో పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఇక ఈ మూవీని ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ చేయడానికి మేకర్స్ సిద్ధం అయ్యారు. సెప్టెంబర్ 15 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫార్మ్ నెట్ఫ్లిక్స్ లో భోళా శంకర్ స్ట్రీమ్ కానుంది. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఈ సినిమాని అందుబాటులోకి తీసుకు వస్తున్నారు.
మరి థియేటర్ లో ఆకట్టుకోలేని ఈ చిత్రం.. ఓటీటీలో అయినా ఆకట్టుకుంటుందేమో చూడాలి. ఇక ఈ సినిమా రిజల్ట్ తో చిరంజీవి.. ఇకపై రీమేక్ చేయకూడదని నిర్ణయం తీసుకున్నాడట. ఈక్రమంలోనే ఇటీవల ఒక మలయాళ మూవీ రీమేక్ చేయాలంటూ ఒక నిర్మాత చిరుని సంప్రదించగా.. అందుకు నో చెప్పాడని ఫిలిం వర్గాల్లో వార్తలు వినిపించాయి.
కాగా చిరంజీవి ఇటీవల 'బింబిసారా' దర్శకుడు వశిష్ఠతో ఒక సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఆ మూవీ సోషియో ఫాంటసీ నేపథ్యంతో తెరకెక్కబోతుందని తెలుస్తుంది. చిరంజీవి బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన కాన్సెప్ట్ పోస్టర్ మూవీ మంచి ఆసక్తినే కలుగజేసింది. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ప్రస్తుతం జరుగుతున్నాయి. నవంబర్ లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్లు సమాచారం.
Next Story