Thu Dec 19 2024 14:38:19 GMT+0000 (Coordinated Universal Time)
చిరంజీవి వీరాభిమానిగా పుష్పరాజ్.. ఫోటోలు లీక్..
పుష్ప 2 షూటింగ్ సెట్స్ నుంచి ఫోటోలు లీక్ అయ్యాయి. ఆ ఫొటోల్లో చిరంజీవి వీరాభిమానిగా పుష్పరాజ్..
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'పుష్ప 2' కోసం అభిమానులంతా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. మొదటిభాగం వరల్డ్ వైడ్ గా సెన్సేషన్ అవ్వడంతో.. సెకండ్ పార్ట్ ని మరింత గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ మూవీ షూటింగ్ దాదాపు అవుట్ డోర్ లోనే జరుగుతుండడంతో.. సెట్స్ నుంచి ఫోటోలు, వీడియోలు బయటకి లీక్ అవుతూ వస్తున్నాయి. ఈక్రమంలోనే మూవీలోని లారీ యాక్షన్ సీక్వెన్స్ వీడియోలు, ఫోటోలు లీక్ అయ్యాయి.
తాజాగా సినిమా హాల్ కి సంబంధించిన కొన్ని ఫోటోలు లీక్ అయ్యాయి. ఆ ఫొటోల్లో మెగాస్టార్ చిరంజీవి నటించిన సూపర్ హిట్ మూవీ 'ఇంద్ర' రిలీజ్ అయ్యినట్లు, ఆ సందర్బంగా థియేటర్ వద్ద భారీ ఫ్లెక్సీలు కట్టడం కనిపిస్తుంది. ఇక ఆ ఫ్లెక్సీల్లో చిరంజీవితో పాటు పుష్పరాజ్ ఫోటోలు కనిపిస్తున్నాయి. పుష్ప 1 సినిమాలో ఒక సన్నివేశంలో చిరంజీవి 'చూడాలని ఉంది' సినిమా రిలీజ్ ని చూపించారు. ఇప్పుడు ఈ మూవీలో 'ఇంద్ర'తో చిరంజీవి రిఫరెన్స్ కనిపించబోతుంది.
ప్రస్తుతం ఈ లీక్ అయిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఇవి చూసిన మెగా అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా ఈ సినిమాని వచ్చే ఏడాది 15న రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఎంతవరకు వచ్చిందనేది..? ఎప్పుడు పూర్తి అవుతుందనేది..? తెలియాల్సి ఉంది.
కాగా పుష్ప 1 సినిమాకి గాను అల్లు అర్జున్ నేషనల్ అవార్డు గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ అవార్డుల పురస్కారం నిన్న అక్టోబర్ 17న ఢిల్లీ ఘనంగా జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులు మీదుగా అల్లు అర్జున్ నేషనల్ అవార్డుని అందుకున్నాడు. బన్నీతో పాటు మ్యూజిక్ డైరెక్టర్ అల్లు అర్జున్ కూడా పుష్ప సినిమాకి గాను నేషనల్ అవార్డుని అందుకున్నాడు.
Next Story