Mon Dec 23 2024 07:36:11 GMT+0000 (Coordinated Universal Time)
ఆ సీన్ లో గ్లిజరిన్ వాడలేదు..పవన్ ని ఊహించుకున్నా : చిరంజీవి
డైరెక్టర్ బాబీ.. ముందుగా ప్లాన్ చేసుకున్న బడ్జెట్ లో తీయడం కూడా సక్సెస్ కి మరో కారణంగా చెప్పారు. బాబీ పడిన కష్టమే..
మెగాస్టార్ చిరంజీవి - రవితేజ కాంబో లో సంక్రాంతికి విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో రన్ అవుతోంది వాల్తేరు వీరయ్య. సినిమా విడుదలైన 10 రోజుల్లోనే రూ. 200 కోట్ల గ్రాస్ ను రాబట్టి.. ఇప్పుడు రూ.250 కోట్ల మార్కుకి చేరువలో ఉంది. బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన వాల్తేరు వీరయ్య.. ఇంత ఘన విజయం సాధించడంతో.. శనివారం సాయంత్రం హనుమకొండలో సక్సెస్ సెలబ్రేషన్స్ ను అభిమానుల సమక్షంలో నిర్వహించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. "వాల్తేరు వీరయ్య ఇంతటి ఘన విజయాన్ని అందుకోడానికి ప్రధాన కారణం ప్రేక్షకులే. వారికే అగ్రతాంబూలం దక్కుతుంది. నేను ఎలా ఉండాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారో .. అలా కనిపించడం వల్లనే ఈ సినిమా ఇంతటి విజయాన్ని సాధించింది" అన్నారు.
డైరెక్టర్ బాబీ.. ముందుగా ప్లాన్ చేసుకున్న బడ్జెట్ లో తీయడం కూడా సక్సెస్ కి మరో కారణంగా చెప్పారు. బాబీ పడిన కష్టమే ఈ రోజున ఆయనను స్టార్ డైరెక్టర్ ను చేసిందన్నారు. ఇక దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన పాటలతో తానూ రెచ్చిపోయి పెర్ఫార్మ్ చేశానన్నారు చిరంజీవి. సినిమాలో.. రవితేజ జీప్ లో వెళ్లే ఎమోషనల్ సీన్ లో గ్లిజరిన్ వాడలేదని.. రవితేజలో పవన్ కల్యాణ్ ను చూసుకుని ఆ సీన్ నేచురల్ గా చేసినట్లు చిరంజీవి తెలిపారు.
ఇక ఈ సక్సెస్ సెలబ్రేషన్స్ కు చరణ్ కూడా రావడంతో.. చిరంజీవి నాటు నాటు పాట గురించి మాట్లాడారు. ఆర్ఆర్ఆర్ లోని 'నాటు నాటు' పాట ఆస్కార్ నామినేషన్స్ వరకూ వెళ్లడం.. ఆ పాటలో చరణ్ ఉండటం తనకు చాలా గర్వంగా ఉందన్నారు. మీ అందరి ప్రోత్సాహం.. మీ విజిల్స్..చప్పట్లు ఇలాగే ఉన్నంతవరకూ ఎన్ని వీరయ్యలైనా చేస్తానంటూ.. శృతిహాసన్ కు బర్త్ డే విషెస్ చెప్పారు.
Next Story