Mon Dec 23 2024 06:07:28 GMT+0000 (Coordinated Universal Time)
సుకుమార్ యాడ్ లో కుమ్మేసిన చిరంజీవి
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ఓ యాడ్ చేశారు. శుభగృహ రియల్ ఎస్టేట్ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్
హైదరాబాద్ : క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ఓ యాడ్ చేశారు. శుభగృహ రియల్ ఎస్టేట్ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా మెగాస్టార్ చిరంజీవి వ్యవహించారు. అన్ని ప్రముఖ టీవీ ఛానెల్స్ తో పాటు.. సోషల్ మీడియాలో ప్రసారం అవుతోంది. తాజాగా బయటకు వచ్చిన ఈ యాడ్ కు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. యాడ్ లో మెగాస్టార్ తో పారు ఖుష్బూ, అనసూయ భరద్వాజ్ కన్పించగా, ఒక మంచి ట్విస్ట్ తో హ్యాపీ న్యూస్ ను రివీల్ చేశారు.
ఉగాది సందర్భంగా విడుదలైన ఈ యాడ్ మెగా అభిమానుల్ని ఆకట్టుకుంటోంది. యాడ్ లో చిరంజీవి భార్యను చీట్ చేస్తున్నాడనుకునే లోపే.. ఇచ్చిన ట్విస్ట్ బావుటుంది. కాగా.. సుకుమార్ పుష్ప 2 పనుల్లో బిజీగా ఉండగా.. చిరంజీవి ఏప్రిల్ 29న ఆచార్యతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఆచార్య తర్వాత.. భోళా శంకర్, గాడ్ ఫాదర్ వంటి వరుస సినిమాల్లో నటిస్తూ.. బిజీగా ఉన్నారు.
Next Story