Mon Dec 23 2024 15:03:45 GMT+0000 (Coordinated Universal Time)
Chiranjeevi : త్రిషకు చిరు సపోర్ట్ ఇవ్వడానికి.. అసలు కారణం ఇదేనా..!
మన్సూర్ వివాదంలో త్రిషకు చిరు సపోర్ట్ ఇవ్వడానికి అసలు కారణం ఇదేనా..? మెగా156 వలన..
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి పాలిటిక్స్ నుంచి బయటకి వచ్చేసిన తరువాత వివాదాలకు కొంచెం దూరంగా ఉంటున్నారు. ఎక్కడ ఏం మాట్లాడినా.. చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడుతున్నారు. అలాంటిది ఇటీవల హీరోయిన్ త్రిష, తమిళ నటుడు మన్సూర్ అలీఖాన్ వివాదంలో చిరు.. మన్సూర్ కామెంట్స్ ని తప్పుబడుతూ ట్వీట్ చేశారు. దానికి మన్సూర్ రియాక్ట్ అవుతూ చిరంజీవి పై పరువు నష్టం దావా కేసు వేశారు.
దీంతో త్రిష-మన్సూర్ వివాదం కాస్త చిరంజీవి- మన్సూర్ వివాదంగా మారిపోయింది. ఇక ఈ విషయం పై కొందరు మెగా అభిమానులు రియాక్ట్ అవుతూ.. అసలు చిరంజీవి ఎందుకు ఈ విషయం పై స్పందించారు అని సందేహం వ్యక్తం చేస్తూ వచ్చారు. ఎందుకంటే, తమిళ ఇండస్ట్రీకి సంబంధించిన ఏ స్టార్ హీరో ఈ విషయం పై రియాక్ట్ అవ్వలేదు. అంతెందుకు అసలు వివాదానికి కారణమైంది లియో మూవీ. ఆ సినిమాలో నటించిన హీరో విజయ్ కూడా రియాక్ట్ అవ్వలేదు.
అలాంటిది చిరంజీవి రియాక్ట్ అవ్వడానికి కారణం ఏంటని పలువురు ప్రశ్నలు వేస్తూ వచ్చారు. తాజాగా దీనికి జవాబు దొరికినట్లు అయ్యింది. చిరు, త్రిషకి సపోర్ట్ చేయడానికి కారణం Mega156 మూవీ అని తెలుస్తుంది. చిరంజీవి తన 156వ సినిమాని బింబిసారా డైరెక్టర్ వశిష్ఠతో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో ఫీమేల్ లీడ్ గా త్రిషని ఎంపిక చేశారట. గతంలో చిరు, త్రిష.. స్టాలిన్ సినిమాలో కలిసి నటించారు. మళ్ళీ ఇప్పుడు ఈ సినిమాలో కలిసి నటించడానికి సిద్దమయ్యారట.
ఈ కారణం వలనే చిరంజీవి, త్రిషకి సపోర్ట్ చేసి ఉంటారని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. కాగా మెగా156కి 'విశ్వంభర' అనే టైటిల్ ని కన్ఫార్మ్ చేశారట. సోషియో ఫాంటసీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీ.. దాదాపు 70 శాతం VFX తోనే రూపొందబోతుందట. ఆస్కార్ విన్నర్ ఎం ఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఆల్రెడీ మొదలైంది. అయితే చిరంజీవి మాత్రం సంక్రాంతి తరువాత నుంచి ఈ మూవీ సెట్స్ లో పాల్గొనున్నారట.
Next Story