రంగంలోకి దిగిన చిరు..!
మెగాస్టార్ చిరంజీవి దాదాపు 200 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న 'సైరా' చిత్రంలో యాక్ట్ చేస్తున్నారు. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు. ముందుగా ఈ సినిమాకు... చిరుకి ప్రస్తుతం ఉన్న మార్కెట్ ని దృష్టిలో పెట్టుకుని చరణ్ 200 కోట్ల వరకు పెట్టొచ్చని రంగంలోకి దిగాడు. కానీ రోజురోజుకి బడ్జెట్ ఎక్కువ అయిపోతుంది. సినిమాలో భారీ కాస్టింగ్ ఉండడంతో బడ్జెట్ కూడా పెరుగుతూ వెళ్తోంది.ఈ సినిమాకు ఇండియా వైడ్ బజ్ రావాలని ఇందులో అమితాబ్ తో ఒక రోల్ చేయిస్తున్నారు. అయితే నిర్మాత రామ్ చరణ్ దీన్ని ప్రతిష్ఠాత్మక చిత్రంగా తీసుకుని సెట్ లో ఎవరు ఉన్నా వారికి రాచ మర్యాదలకు ఎక్కడా లోటు లేకుండా చూసుకుంటున్నాడట.
ఇక చిరంజీవి చేతుల మీదుగా...
సాంకేతిక నిపుణుల నుండి నటీనటుల వరకు అందరికీ రాచమర్యాదలు మొదలయ్యాయి. దీంతో ప్రొడక్షన్‌కీ విపరీతమైన ఖర్చు అవ్వడం మొదలైంది. దానికి తోడు రీషూట్ల వల్ల, షూటింగ్లో జాప్యం వల్ల ప్రొడక్షన్ లెక్కలు మరింత పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో చిరంజీవి రంగంలోకి దిగి.. బడ్జెట్‌ని కంట్రోల్ చేయడం మొదలెట్టాడట. ఇప్పుటి వరకు ప్రొడక్షన్ అంతా చరణ్ కనుసన్నల్లో జరిగేది. కానీ ఇప్పుటి నుండి చిరు గైడెన్స్ లో జరగనుంది. అంటే చిరు పరిశీలించి చరణ్‌కి గైడెన్స్ ఇస్తాడవి చరణ్ పాటిస్తాడు.