అండర్ వాటర్ యాక్షన్ సీక్వెన్స్ లో చిరు..!
మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ఎన్నడూ లేని విధంగా రూ.200 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరంజీవి యాక్షన్ సీన్స్ కోసం చాలా కష్టపడుతున్నాడని తెలుస్తుంది. ఈ సినిమా కోసమే చిరు కసరత్తులు చేసి తన బాడీ మార్చుకున్నారు. లేటెస్ట్ గా యాక్షన్ సీక్వెన్స్ లో పాల్గొన్న చిరు మరో సాహసానికి రెడీ అయినట్టు సమాచారం. ఇందులో అండర్ వాటర్ యాక్షన్ సీక్వెన్స్ ఒకటి ఉందంట . ఈ సీక్వెన్స్ కి చిరు రెడీ అవుతున్నట్టు ఇండస్ట్రీ టాక్. దీని కోసం హాలీవుడ్ నుంచి యాక్షన్ టీంను రప్పించారు. వీరితో పాటు ముంబయి నుంచి ఓ స్పెషల్ టీంని కూడా రప్పించి ఈ యాక్షన్ సీక్వెన్స్ ను రెడీ చేస్తున్నారు.
ఈ వయస్సులో ఇంత రిస్క్..?
కొన్ని రోజుల పాటు నీటి లోపలే ఈ సీక్వెన్స్ తీర్చిదిద్దనున్నారట. ఎంతో కష్టంతో కూడుకున్న ఈ సీన్స్ కోసం చిరు కసరత్తులు చేస్తున్నారు. 63 ఏళ్ల వయసులో చిరు ఇటువంటి సాహసం చేయడంతో ఫ్యాన్స్.. ఇండస్ట్రీ వర్గాల నుండి అభినందనలు వస్తున్నాయి. త్వరలోనే అండర్ వాటర్ యాక్షన్ సీక్వెన్స్ స్టార్ట్ కానుంది. రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. టాలీవుడ్ లో అండర్ వాటర్ యాక్షన్ సీక్వెన్స్ ఇది మొదటిసారి. చిన్నచిన్న ఫైట్స్ మినహాయిస్తే ఇదే మొదటిసారి.